ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ATM Cash Withdrawal Charges: పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్

ABN, Publish Date - May 01 , 2025 | 09:33 AM

ఏటీఎమ్ విత్‌డ్రాల్ చార్జీలు పెంచినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త చార్జీలు ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.

ATM Cash Withdrawal Charges

ఇంటర్నెట్ డెస్క్: ఏటీఎమ్ సేవలకు సంబంధించి నేటి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. అదనపు ఏటీఎమ్ ట్రాన్సాక్షన్లకు ఒక లావాదేవీకి రూ.23 చొప్పున చార్జీని బ్యాంకులు వసూలు చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల వెల్లడించింది. గతంలో అదనపు ట్రాన్సాక్షన్ చార్జీ రూ.21గా ఉండగా ప్రస్తుతం దీన్ని బ్యాంకులు రూ.23కు పెంచేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. నేటి నుంచే ఈ చార్జీలు అమల్లోకి వచ్చాయి. ‘‘ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి జరిపే ప్రతి ఏటీఎమ్ ట్రాన్సాక్షన్లకు కస్టమర్లు రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి’’ అని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం ఈ కొత్త నిబంధనలు.. రీజినల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు, అధీకృత ఏటీఎమ్‌ ఆపరేటర్లు, కార్డు పేమెంట్ నెట్వర్క్, వైట్ లేబుల్ ఏటీఎమ్‌లతో పాటు అన్ని కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయి.


తాజా నిబంధనల ప్రకారం, ప్రతి కస్టమర్‌కు తమ సొంత బ్యాంకు ఏటీఎమ్‌ల్లో నెలకు ఐదు నగదు, నగదేతర లావాదేవీలు ఉంటాయి. మెట్రో నగరాల్లోని వారికి ఇతర బ్యాంకుల్లో మరో మూడు ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి. నాన్ మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఎటీఎమ్‌లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకుల్లో మరో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి.

ఈ పరిమితి దాటితే బ్యాంకులు కస్టమర్ల నుంచి ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.23 చార్జీని వసూలు చేస్తాయి. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లతో (నగదు డిపాజిట్, విత్‌డ్రాల్) పాటు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లకు (బ్యాంకు బ్యాలెన్స్ చెకింగ్, ఏటీఎమ్ పిన్ మార్పు వంటివి) వర్తిస్తుంది. ఇక క్యాష్ రీసైక్లర్ మెషీన్లకు సంబంధించి నగదు డిపాజిట చేసే లావాదేవీలకు ఈ నిబంధనలు వర్తించవు


ఇక ఏటీఎమ్ ఇంటర్‌ఛేంజ్ ఫీజును ఏటీఎమ్ నెట్వర్క్ నిర్ణయిస్తుందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇంటర్‌ఛేంజ్ ఫీ రూ.19గా, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లకు రూ.7గా ఉంది. తమ కస్టమర్లు మరో బ్యాంకు ఏటీఎమ్‌లను వినియోగించినందుకు బ్యాంకులు ఈ చార్జీని చెలిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

నా కూతురు డబ్బులు అడుగుతుందనుకుని కాస్త భయపడ్డా.. బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

వజ్రాలు కొంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త

గోల్డ్ కాయిన్స్ కొనాలా లేదా బంగారు నగలు కొనాలా అని డౌటా? అయితే..

తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 01 , 2025 | 10:55 AM