Defence Deal: ఆస్ట్రా మైక్రోవేవ్‌కు రూ 2000 కోట్ల ఆర్డర్
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:49 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్డర్ విలువ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్ అతిమ్ కాబ్రా సూచనప్రాయంగా వెల్లడించారు. ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన 230 సుఖోయ్-30 యుద్ధ విమానాల ఆధునీకరణతో పాటు పెద్దఎత్తున క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ (క్యూఆర్‌ఎ్‌సఏఎం) అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన కీలక ఎలకా్ట్రనిక్ ఉపకరణాల సరఫరా కాంట్రాక్టు తమకు దక్కే అవకాశం ఉందని కాబ్రా తెలిపారు. కాగా కంపెనీ ఇప్పటికే విరూపాక్ష రాడార్ కార్యక్రమంలో కీలకంగా ఉంది.
ఇవీ చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:50 AM