ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఎస్‌బీఎల్‌ కొత్త వెంచర్‌ బ్రాడ్‌వే

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:30 AM

స్థానిక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏఎస్‌బీఎల్‌ నగరంలో మరో ప్రీమియం రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టింది. ‘బ్రాడ్‌వే’ పేరుతో ఈ నెల 14న ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో...

ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో జీ+50 ప్లోర్లతో నిర్మాణం

ఒక్కో ఫ్లాట్‌ కనీస ధర రూ.2.5 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏఎస్‌బీఎల్‌ నగరంలో మరో ప్రీమియం రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టింది. ‘బ్రాడ్‌వే’ పేరుతో ఈ నెల 14న ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. రూ.900 కోట్ల పెట్టు బడితో తలపెట్టిన ఈ ప్రీమియం రెసిడెన్షియల్‌ వెంచర్‌ కోసం ఏఎస్‌బీఎల్‌ ఇప్పటికే రూ.400 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.275 కోట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ గ్రూప్‌ నుంచి సమీకరించినట్టు కంపెనీ తెలిపింది. ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో జీ+50 ఫ్లోర్లలో 885 లగ్జరీ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు నిర్మిస్తారు. ఇందులో ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 2,035 నుంచి 2,650 చదరపు అడుగుల వరకు ఉంటుంది. అత్యాధునిక సదుపాయా లతో నిర్మిస్తున్న ఈ వెంచర్‌లో ఒక్కో ఫ్లాటు కనీస ధర రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టు 2029 డిసెంబరుకల్లా పూర్తవుతుందని ఏఎస్‌బీఎల్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 04:30 AM