కాలుష్యరహితంగా సిమెంట్ ఉత్పత్తి
ABN, Publish Date - May 16 , 2025 | 04:35 AM
పర్యావరణానికి హాని కలగని రీతిలో సిమెంట్ ఉత్పత్తి చేయడంలో భారత సిమెంట్ పరిశ్రమ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని అదానీ గ్రూప్ కంపెనీ అంబుజా సిమెంట్...
2060 నాటికే ‘నెట్ జీరో’ స్థాయికి.. అంబుజా సిమెంట్స్ ఎండీ అజయ్ కపూర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పర్యావరణానికి హాని కలగని రీతిలో సిమెంట్ ఉత్పత్తి చేయడంలో భారత సిమెంట్ పరిశ్రమ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని అదానీ గ్రూప్ కంపెనీ అంబుజా సిమెంట్ ఎండీ, గ్రీన్ సిమెంటెక్, 2025 సదస్సు చైర్మన్ అజయ్ కపూర్ చెప్పారు. ఈ విషయంలో అమెరికా, యూరప్ దేశాలు కూడా మనకు సాటి రావన్నారు. గ్రీన్ సిమెంటెక్-2025 సదస్సు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 2070 కంటే పదేళ్ల ముం దే భారత సిమెంట్ పరిశ్రమ జీరో కాలుష్య (నెట్ జీరో) స్థాయికి చేరుకుంటుందన్నారు. ఉత్పత్తిలో వెలువడే వేడిని సైతం ఇంధనంగా మార్చుకోవడం ద్వారా సిమెంట్ కంపెనీలు తమ ఇంధన అవసరాల్లో 40ు తీర్చుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. పరిశ్రమ తీసుకున్న చర్యలతో ప్రస్తుతం ఒక టన్ను సిమెంట్ ఉత్పత్తితో వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను 800 కిలోలకు పరిమితం చేసినట్టు సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 16 , 2025 | 04:35 AM