టైమ్ దాతల జాబితాలో ముకేశ్ అంబానీ అజీమ్ ప్రేమ్‌జీ
ABN, Publish Date - May 21 , 2025 | 03:08 AM
ప్రపంచంలో దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించే అగ్రశ్రేణి 100 మంది ప్రముఖుల జాబితాలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీతో పాటు విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు...
నిఖిల్ కామత్‌కూ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచంలో దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించే అగ్రశ్రేణి 100 మంది ప్రముఖుల జాబితాలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీతో పాటు విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు చోటు దక్కింది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచం లో దాతృత్వ కార్యకలాపాల్లో అత్యంత ప్రభావశీలురైన 100 మంది దాతల జాబితా-2025ని తొలిసారిగా విడుదల చేసింది. అత్యంత అవసరంలో ఉన్న సామాజిక వర్గాలకు విరాళాలందించే దాతలు, ఫౌండేషన్ల సారథులు, లాభాపేక్ష రహిత సంస్థల ఉదారతకు సంబంధించిన కథనాలను ఈ జాబితా వెల్లడిస్తుందని టైమ్ పత్రిక తెలిపింది. టైమ్ కథనం ప్రకారం ముకేశ్, నీతా అంబానీ దంపతులు 2024లో రూ.407 కోట్ల విరాళాలందించి దేశంలోనే అతిపెద్ద దాతలుగా నిలిచారు. దేశంలో అత్యంత సంపన్నులైన ఈ దంపతులు తమ దాతృత్వ కార్యకలాపాల ద్వారా కోట్లాది మందికి సాధికారత కల్పిస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు. 11,000 కోట్ల డాలర్ల (రూ.9.35 లక్షల కోట్లు) సంపద కలిగిన తమ వ్యాపార సామ్రాజ్యం ఎన్ని రంగాలకు విస్తరించిందో వారి దాతృత్వ కార్యకలాపాలు కూడా అంతగా విభిన్న రంగాలకు విస్తరించాయని పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలైన నీతా అంబానీ తమ ఫౌండేషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు స్వయంగా సారథ్యం వహిస్తూ ఉంటారని టైమ్ మ్యాగజైన్ తెలిపింది.
సారథ్యంలోని వైఐపీపీ 300 పాఠశాలలకు కంప్యూటర్లు అందించేందుకు, కెరీర్ కౌన్సెలింగ్, ఇతర సేవల కోసం 80 కోట్ల డాలర్లు (రూ.6,800 కోట్లు) సమీకరించింది. కాగా ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, అమెరికన్ దాత మెలిండా ఫ్రెంచ్ గేట్స్, ప్రిన్స్ విలియం, వేల్స్ ప్రిన్సెస్ కాథరిన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
గాంధేయవాది ప్రేమ్‌జీ
గాంధేయవాదిగా పేరొందిన టెక్నాలజీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ ప్రపంచంలో అత్యంత ఉదారంగా దానధర్మాలు చేసే ప్రముఖుల్లో ఒకరుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఒక క్రమ పద్ధతిలో తన సంపదను వినియోగిస్తున్నారని టైమ్ పత్రిక తెలిపింది. గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేసిన తొలి భారతీయుడు ప్రేమ్‌జీ. 25 సంవత్సరాల క్రితం తాను ప్రారంభించిన ఫౌండేషన్‌కు 2013లో తన కంపెనీకి చెందిన 2,900 కోట్ల డాలర్ల (రూ.2.46 లక్షల కోట్లు) విలువ గల షేర్లను విరాళంగా అందించారు.
అంతేకాకుండా విప్రో సంస్థ విద్య, ఆరోగ్యం, ఇతర రంగాల మెరుగుదలకు కృషి చేస్తున్న 940 సంస్థలకు 2023-24 సంవత్సరంలో 10.9 కోట్ల డాలర్లు (రూ.926.5 కోట్లు) సాంప్రదాయిక గ్రాంట్లుగా అందించింది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 59 క్షేత్ర స్థాయి కార్యాలయాలు, 263 ఉపాధ్యాయ అభ్యాస కేంద్రా ల ద్వారా ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు, గ్రామీణ బాలల సంరక్షణ సిబ్బందితో సంబంధాలు కలిగి ఉంది. ఇప్పటి వరకు 80 లక్షల మంది బాలబాలికల కోసం విద్యా కార్యక్రమాలు చేపట్టింది.
విద్యనే నమ్మిన నిఖిల్ కామత్
డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ 2023లో గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేశారు. 36 సంవత్సరాల పిన్న వయసులో సంతకం చేసిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు. విద్య ఒక్కటే సమాజంలో అసమానతలను నిర్మూలించగలదని విశ్వసించే నిఖిల్ అప్పటికే పలు పర్యావరణ, విద్యా ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు విరాళంగా అందించారు. యంగ్ ఇండియా ఫిలాంత్రపిక్ ప్లెడ్జ్ (వైఐపీపీ) పేరిట సొంత సంస్థను స్థాపించి 10 కోట్ల డాలర్లకు పైబడిన సంపద కలిగిన, 45 సంవత్సరాల లోపు వయస్కులైన యువత అందరూ తమ సంపదలో 25 శాతం విరాళాలుగా అందించాలని పిలుపు ఇచ్చారని టైమ్ తెలిపింది.
వాతావరణ మార్పుల సొల్యూషన్లపై కృషి చేస్తున్న రెయిన్ మ్యాటర్ ఫౌండేషన్‌కు 10 కోట్ల డాలర్లకు (రూ.850 కోట్లు) పైగా నిధులు అందించారు. నిఖిల్ సారథ్యంలోని వైఐపీపీ 300 పాఠశాలలకు కంప్యూటర్లు అందించేందుకు, కెరీర్ కౌన్సెలింగ్, ఇతర సేవల కోసం 80 కోట్ల డాలర్లు (రూ.6,800 కోట్లు) సమీకరించింది. కాగా ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, అమెరికన్ దాత మెలిండా ఫ్రెంచ్ గేట్స్, ప్రిన్స్ విలియం, వేల్స్ ప్రిన్సెస్ కాథరిన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 21 , 2025 | 03:08 AM