ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Richest Family Business India: అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల్లో అంబానీలదే హవా

ABN, Publish Date - Aug 13 , 2025 | 01:47 AM

ఈ ఏడాదికి గాను దేశంలోని తొలి తరం పారిశ్రామికవేత్తలు, వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా మంగళవారం విడుదలైంది. బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

రూ.28 లక్షల కోట్లతో అగ్రస్థానం.. దేశ జీడీపీలో 12 శాతానికి సమానం

అదానీ గ్రూప్‌ రూ.14 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో పోలిస్తే డబుల్‌..

జాబితాలో 14 తెలుగు కుటుంబ వ్యాపారాలు..

బార్‌క్లే్‌స-హురున్‌ సంయుక్త నివేదిక విడుదల

అత్యంత విలువైన 300 ఫ్యామిలీ బిజినె్‌సల మొత్తం విలువ రూ.134 లక్షల కోట్లు

ముంబై: ఈ ఏడాదికి గాను దేశంలోని తొలి తరం పారిశ్రామికవేత్తలు, వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా మంగళవారం విడుదలైంది. బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. వారసుల నిర్వహణలోని విలువైన వ్యాపారాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుటుంబానిదే అగ్రస్థానం. అంబానీ కుటుంబ వ్యాపార విలు వ రూ.28.23 లక్షల కోట్లు. తొలి తరం కుటుంబ వ్యాపారాల్లో నం.1గా ఉన్న అదానీ గ్రూప్‌ విలువ రూ.14.01 లక్షల కోట్లతో పోలిస్తే రెండింతలు ఇది. అంతేకాదు, దేశ జీడీపీలో దాదాపు 12 శాతానికి సమానం. ఈ లిస్ట్‌లో అంబానీకి అగ్ర స్థానం లభించడం ఇది రెండోసారి. గత ఏడాదితో పోలిస్తే, ఈ కుటుంబ వ్యాపార విలువ 10 శాతం పెరిగిందని బార్‌క్లేస్‌-హురున్‌ రిపోర్టు వెల్లడించింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన కుమార మంగళం బిర్లా కుటుంబం రూ.6.47 లక్షల కోట్ల విలువతో రెండో స్థానంలో ఉండగా.. జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌కు చెందిన జిందాల్‌ ఫ్యామిలీ రూ.5.71 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో ఉంది. ఈ టాప్‌-3 కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ రూ.40.4 లక్షల కోట్లు. ఫిలిప్పీన్స్‌ జీడీపీకి సమానమిది. నివేదికలోని మరిన్ని విషయాలు..

  • తొలి తరం కుటుంబ వ్యాపారాల్లో అదానీ గ్రూప్‌నకు చెందిన గౌతమ్‌ అదానీ ఫ్యామిలీ వరుసగా రెండోసారి నం.1గా నిలిచింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పూనావాలా కుటుంబం రూ.2.3 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో రెండో స్థానంలో ఉంది.

  • తెలుగు వారి విషయానికొస్తే.. తొలితరం, మలి తరం నిర్వహణలోని 14 కుటుంబాల వ్యాపారాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. మలి తరం విభాగంలో 9, తొలి తరం నిర్వహణలో 5 కుటుంబ వ్యాపారాలున్నాయి. మలి తరం సారథ్య వ్యాపారాల్లో డాక్టర్‌ రెడ్డీ్‌సకు చెందిన ఫ్యామిలీ, తొలి తరం నాయకుల్లో దివీస్‌ లేబొరేటరీ్‌సకు చెందిన మురళి దివి కుటుంబం అగ్రస్థానాల్లో ఉన్నాయి.

  • ఈ లిస్ట్‌లోని అత్యంత విలువైన 300 కుటుంబాల సంపద 1.6 లక్షల కోట్ల డాలర్ల (రూ.134 లక్షల కోట్లు) పైమాటే. దేశ జీడీపీలో ఇది 40 శాతానికి సమానం. టర్కీ, ఫిన్లాండ్‌ దేశాల మొత్తం జీడీపీ కంటే కూడా అధికం. గడిచిన ఏడాది కాలంలో ఈ 300 కుటుంబ వ్యాపారాలు రోజుకు రూ.7,100 కోట్ల సంపదను సృష్టించాయి.

  • ఈ 300 వ్యాపారాలు దేశంలో 20 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. అంటే, బహ్రెయిన్‌ మొత్తం జనాభా కంటే అధికం. కాగా, ఈ కంపెనీలు మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయి. గతసారి వసూలైన మొత్తం కార్పొరేట్‌ పన్నుల్లో 15 శాతానికి సమానమిది.

  • ఈ లిస్ట్‌లోని 74 శాతం కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో నమోదైనవే. రూ.85,800 కోట్ల విలువతో హల్దీరామ్‌ దేశంలో అత్యంత విలువైన అన్‌ లిస్టెడ్‌ కంపెనీగా ఉంది. ఈసారి జాబితాలోని 22 కంపెనీలకు మహిళలు సారథులుగా ఉన్నారు.

  • జాబితాలోని కుటుంబ వ్యాపారాల మొత్తం సంపదలో టాప్‌-10 కంపెనీల వాటాయే దాదాపు 50 శాతం.

  • రూ.1.58 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో వాడియా కుటుంబం జాబితాలో అత్యంత సుధీర్ఘ వ్యాపార చరిత్ర కలిగి ఉంది.

  • మలి తరం నాయకుల నిర్వహణలోని తెలుగు కుటుంబ వ్యాపారాలు

ర్యాంక్‌ కుటుంబం కంపెనీ విలువ

(రూ.కోట్లు)

22 సతీశ్‌ రెడ్డి, జీవీ ప్రసాద్‌ డాక్టర్‌ రెడ్డీస్‌ 1,07,200

104 ప్రసాద్‌, అశ్విన్‌ దేవినేని నవ లిమిటెడ్‌ 17,200

115 శ్రీనివాస్‌ రెడ్డి, కశ్యప్‌ రెడ్డి మేధ సర్వో డ్రైవ్‌ 14,900

116 ఏ రంగ రాజు ఎన్‌సీసీ 14,500

121 మహిమ దాట్ల బయోలాజికల్‌-ఈ 13,100

143 అల్లూరి ఇంద్ర కుమార్‌ అవంతి ఫీడ్స్‌ 10,000

157 కేశవ్‌ రెడ్డి అరాజెన్‌ లైఫ్‌సైన్సెస్‌ 8,400

205 రాజు ఫ్యామిలీ ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ 4,400

243 గుప్తా ఫ్యామిలీ డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ 3,200

తొలితరం తెలుగు కుటుంబ వ్యాపారాలు

3 మురళీ దివి దివీస్‌ లేబొరేటరీస్‌ 1,80,000

5 ప్రతాప్‌ సీ రెడ్డి అపోలో హాస్పిటల్స్‌ 1,04,200

6 గ్రంధి మల్లికార్జున రావు జీఎంఆర్‌ గ్రూప్‌ 98,300

7 పీపీ రెడ్డి ఫ్యామిలీ మేఘా ఇంజనీరింగ్‌ 85,300

20 బొల్లినేని భాస్కర్‌ రావు కిమ్స్‌ హాస్పిటల్స్‌ 27,000

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 01:47 AM