Alumex India 2025: సెప్టెంబరులో అల్యూమెక్స్ ఇండియా
ABN, Publish Date - Aug 08 , 2025 | 05:36 AM
ఢిల్లీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. ‘అల్యూమెక్స్ ఇండియా- 2025’ పేరుతో సెప్టెంబరు 10-13 తేదీల మధ్య ఈ సదస్సు జరుగుతుందని అల్యూమినియం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఢిల్లీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. ‘అల్యూమెక్స్ ఇండియా- 2025’ పేరుతో సెప్టెంబరు 10-13 తేదీల మధ్య ఈ సదస్సు జరుగుతుందని అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (అలెమై) జాతీయ అధ్యక్షుడు జితేంద్ర చోప్రా చెప్పారు. ఈ సదస్సు లో 250కిపైగా దేశ, విదేశీ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశీయ అల్యూమినియం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉన్న అవకాశాలపై చర్చించనున్నట్టు చోప్రా తెలిపారు. దేశ అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ఉత్పత్తుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 05:36 AM