రెండేళ్లలో అన్ని వైడ్ బాడీ విమానాలకు కొత్త రూపం
ABN, Publish Date - Mar 19 , 2025 | 05:35 AM
సంపూర్ణ ప్రక్షాళన బాటలో ఉన్న ఎయిరిండియా వారసత్వంగా వచ్చిన అన్ని వైడ్‌బాడీ విమానాలకు కొత్త రూపం కల్పించే కార్యక్రమాన్ని 2027 మధ్య నాటికల్లా...
ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్
న్యూఢిల్లీ: సంపూర్ణ ప్రక్షాళన బాటలో ఉన్న ఎయిరిండియా వారసత్వంగా వచ్చిన అన్ని వైడ్‌బాడీ విమానాలకు కొత్త రూపం కల్పించే కార్యక్రమాన్ని 2027 మధ్య నాటికల్లా పూర్తి చేయనుంది. ప్రపంచ విమానయాన మార్కెట్లో కనీసం వచ్చే నాలుగైదు సంవత్సరాల పాటు ‘‘సరఫరాల కొరత’’ కొనసాగుతుందని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. నారో బాడీ విమానాలకు ఇంజన్ల కొరత, విమానాల ఫ్యూజిలేజ్‌లో ఉపయోగించే విడిభాగాలు, సీట్ల కొరత వంటివి ఇబ్బందికరంగా ఉన్న అంశాలని ఆయన తెలిపారు. అలాగే కొద్ది కాలం క్రితం ఎయిరిండియాలో విలీనమైన విస్తారా విమానాలకు కొత్తగా రంగులు వేసి అవసరమైన హంగులు చేసే పని ఏడాదిన్నర కాలంలో ముగుస్తుందని అన్నారు. విమానాలను కొత్త హంగులతో రీఫిట్ చేయడం తమ తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు. బోయింగ్ 777 విమానాల రీఫిట్ కార్యక్రమం గత ఏడాదే ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ సీట్ల సరఫరాలో కొరత వల్ల జాప్యమైందని స్కిఫ్ట్ ఇండియా కార్యక్రమంలో మాట్లాడుతూ విల్సన్ తెలిపారు.
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 19 , 2025 | 05:52 AM