ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిర్‌టెల్‌ లాభం ఐదింతలు

ABN, Publish Date - May 14 , 2025 | 04:45 AM

భారతి ఎయిర్‌టెల్‌ మార్చి త్రైమాసికంలో రూ.47,876.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.11,022 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం...

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్‌ మార్చి త్రైమాసికంలో రూ.47,876.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.11,022 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 27 శాతం, నికర లాభం 432 శాతం పెరిగాయి. గత ఏడాది జూలై మొదటి వారంలో ప్రకటించిన టారి్‌ఫల పెంపు ఇందుకు బాగా దోహదం చేసిందని కంపెనీ తెలిపింది. దీంతో ఒక్కో ఖాతాదారుడి నుంచి లభించే సగటు ఆదాయం 17 శాతం పెరిగి రూ.245కు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా ఎయిర్‌టెల్‌ రూ.1,72,985.2 కోట్ల ఆదాయంపై రూ.33,556 కోట్ల నికర లాభం ప్రకటించింది. వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.16 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 04:45 AM