ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ కేటుగాళ్లపై ఉమ్మడి యుద్ధం

ABN, Publish Date - May 26 , 2025 | 05:50 AM

సైబర్‌ నేరాల కట్టడికి టెలికం కంపెనీ లు ముందుకొస్తున్నాయి. తమ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సైబర్‌ నేరాలు, మోసాలు, కుంభకోణాలను కట్టడి చేసేందుకు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియాతో కలిసి ...

ల్కోలకు ఎయిర్‌టెల్‌ ప్రతిపాదన

న్యూఢిల్లీ: సైబర్‌ నేరాల కట్టడికి టెలికం కంపెనీ లు ముందుకొస్తున్నాయి. తమ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సైబర్‌ నేరాలు, మోసాలు, కుంభకోణాలను కట్టడి చేసేందుకు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియాతో కలిసి పని చేసేందుకు ఎయిర్‌టెల్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈ రెండు కంపెనీలకు ఒక ప్రతిపాదన చేసినట్టు టెలికం శాఖ (డాట్‌), ట్రాయ్‌కు తెలిపింది. సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లో మోసపోతున్న వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇందుకోసం అందరం కలిసి పని చేద్దామని రెండు కంపెనీలకు విడి విడిగా లేఖలు రాసింది. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే సైబర్‌ కేటుగాళ్లు వివిద రకాల మోసాలతో అమాయక వినియోగదారుల నుంచి రూ.11,000 కోట్లకుపైగా కొల్లగొట్టడంతో దేశవ్యాప్తంగా పోలీసుల వద్ద 17 లక్షలకుపైగా కేసులు నమోదైన విసయాన్ని ఎయిర్‌టెల్‌ ఆ లేఖలో గుర్తు చేసింది.


తెలివి మీరిన మోసగాళ్లు

డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోవడంతో సైబర్‌ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ కూడా ఇందుకు కలిసి వస్తోంది. టెలికం ఖాతాదారుల ఇమెయిల్స్‌, మొబైల్‌ నంబర్లు సేకరించి ఫిషింగ్‌, స్పామ్‌ల ద్వారా వారి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇంకొందరు నకిలీ లోన్‌ ఆఫ ర్లు, మోసపూరిత పేమెంట్స్‌ పేరుతో టోపీ పెడుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కూడా వీరికి తోడవడంతో అచ్చం ఖాతాదారుల వాయి్‌సను అనుకరిస్తూ బంధుమిత్రులతో మాట్లాడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో ఎయిర్‌టెల్‌ ఇటీవల తన ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సొల్యూషన్స్‌ను పటిష్టం చేసింది. ఓటీటీ యాప్స్‌, వాట్సప్‌, టెలిగ్రాం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వచ్చే అనేక నకిలీ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసింది. అయితే సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకీ అధునాతన టెక్నాలజీతో రెచ్చిపోతున్నందున టెల్కోలన్నీ కలిసికట్టుగా వారి ఆటకట్టించడం మేలని ఎయిర్‌టెల్‌ తన లేఖలో పేర్కొంది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:50 AM