Tax Filing: ఇక ఏఐ సహాయంతో తెలుగులోనే ట్యాక్స్ ఫైలింగ్
ABN, Publish Date - Jul 13 , 2025 | 03:05 AM
పన్ను చెల్లింపుదారులు కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో తమ మాతృభాషలోనే పన్ను రిటర్నులు దాఖలు చేసే సదుపాయాన్ని ఫిన్‌టెక్ సంస్థ క్లియర్ టాక్స్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఇలాంటి...
పన్ను చెల్లింపుదారులు కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో తమ మాతృభాషలోనే పన్ను రిటర్నులు దాఖలు చేసే సదుపాయాన్ని ఫిన్‌టెక్ సంస్థ క్లియర్ టాక్స్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఇలాంటి సదుపాయం అందుబాటులోకి తేవడం ఇదే ప్రథమం. ఇందుకుగాను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కర్ణాటక, బెంగాలీ భాషల్లో ఏఐ శక్తితో పని చేసే ట్యాక్స్ అసిస్టెంట్‌ను క్లియర్ టాక్స్ డిజైన్ చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ మాతృభాషలో వాట్సప్, స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లేదా క్లియర్ టాక్స్ వెబ్‌సైట్ ద్వారా చాట్ చేస్తూ రిటర్న్ దాఖలు చేయవచ్చు.
వేతన జీవులు, సాధారణ ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, తొలిసారి పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్న వారు అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. పన్ను చెల్లింపుదారులు తమ పాన్ నంబర్ ఇచ్చి ఫారం-16 జత చేస్తే చాలు.. మిగతా తతంగం అంతా ఏఐ చూసుకుంటుంది. వారికి సంబంధించిన 95ు డేటాను ఐటీ శాఖ నుంచి సేకరించి ఆ వ్యక్తికి చెందిన అన్ని రకాల రాయితీలు, కోతలు వర్తింప చేసి రిటర్న్ దాఖలు చేస్తుంది.
ఇవీ చదవండి:
చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్
బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 13 , 2025 | 03:05 AM