ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Young Entrepreneurs: హురున్‌ యువ పారిశ్రామికవేత్తల్లో శశాంక్‌ గుజ్జుల, అనుపమ్‌ పెదరాల

ABN, Publish Date - Jul 18 , 2025 | 06:07 AM

దేశంలో 30 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తల జాబితాలో క్విక్‌ కామర్స్‌ స్టార్టప్‌ జెప్టో సహ వ్యవస్థాపకులైన అదిత్‌ పలిచ, కైవల్య వోహ్రా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మొత్తం 79 మంది యంగ్‌ ఆంత్రప్రెన్యూర్ల వివరాలతో కూడిన ఈ జాబితాను...

అగ్రస్థానంలో జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా, అదిత్‌ పలిచ

  • అనంత్‌ అంబానీ, సాగర్‌ అదానీలకూ చోటు

న్యూఢిల్లీ: దేశంలో 30 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తల జాబితాలో క్విక్‌ కామర్స్‌ స్టార్టప్‌ జెప్టో సహ వ్యవస్థాపకులైన అదిత్‌ పలిచ, కైవల్య వోహ్రా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మొత్తం 79 మంది యంగ్‌ ఆంత్రప్రెన్యూర్ల వివరాలతో కూడిన ఈ జాబితాను అవెండస్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా గురువారం విడుదల చేశాయి. హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ నెక్ట్స్‌వేవ్‌ సహ వ్యవస్థాపకులు శశాంక్‌ రెడ్డి గుజ్జుల, అనుపమ్‌ పెదరాలకు కూడా ఈ లిస్ట్‌లో స్థానం లభించింది. మిర్యాలగూడకు చెందిన 28 ఏళ్ల శశాంక్‌ గుజ్జుల, ఏలూరు జిల్లా పెదరాయి గ్రామానికి చెందిన 30 ఏళ్ల అనుపమ్‌ పెదరాల వరుసగా 29, 30 స్థానాల్లో ఉన్నారు. కాలేజీ విద్యార్థులకు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో వీరు 2020లో నెక్ట్స్‌వేవ్‌ను ప్రారంభించారు. కాగా, రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన అనంత్‌ అంబానీ, రాధిక అంబానీతో పాటు అదానీ గ్రూప్‌నకు చెందిన సాగర్‌ అదానీ సహా పలువురు రెండో తరం పారిశ్రామికవేత్తలకు సైతం ఈ జాబితాలో చోటు లభించింది.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 06:07 AM