అదానీ గ్రూప్ పన్ను చెల్లింపులు రూ 75000 కోట్లు
ABN, Publish Date - Jun 06 , 2025 | 05:56 AM
గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తమ లిస్టెడ్ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.75,945 కోట్లు చెల్లించినట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం చెల్లించిన...
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తమ లిస్టెడ్ కంపెనీల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.75,945 కోట్లు చెల్లించినట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం చెల్లించిన రూ.58,104 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం ఎక్కువ. ఇందులో రూ.28,720 కోట్లు ప్రత్యక్ష పన్నులు, రూ.45,407 కోట్లు పరోక్ష పన్నులు, రూ.818 కోట్లు ఉద్యోగుల సామాజిక భద్రతా పథకాల రూపంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం తాము పన్నులు, ఇతర రూపాల్లో చెల్లించిన మొత్తం ముంబై మెట్రో నెట్‌వర్క్ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తానికి లేదా ఒక ఒలింపిక్ క్రీడల నిర్వహణకు అ య్యే ఖర్చుకు సమానమని అదానీ గ్రూప్ తెలిపింది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 06 , 2025 | 05:56 AM