ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Adani Ports: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. హైఫా పోర్టుకు ఎలాంటి నష్టమూ జరగలేదన్న అదానీ గ్రూప్

ABN, Publish Date - Jun 16 , 2025 | 07:18 AM

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ వారం ఆరంభంలో ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అందుకు ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది.

Haifa port

ఇజ్రాయెల్ (Israel) ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ వారం ఆరంభంలో ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అందుకు ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టుకు (Haifa port) తీవ్ర నష్టం వాటిల్లిందని వార్తలు వచ్చాయి. ఈ పోర్టు కార్యకలపాలను మన దేశానికి చెందిన అదానీ గ్రూపు (Adani Group) నిర్వహిస్తోంది.

ఇరాన్‌ నుంచి వచ్చిన కొన్ని బలిస్టిక్ క్షిపణులు, హైఫా ఓడరేవులోని కెమికల్ టెర్మినల్‌, శుద్ధి కర్మాగారంపై పడినట్టు వార్తలు వచ్చాయి (Ballistic missile attack). ఈ దాడిలో హైఫా ఓడరేవు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆదివారం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అదానీ గ్రూపు సీఎఫ్‌ఓ ఖండించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి హైఫా ఓడరేవు కార్యకలాపాలకు ఎటువంటి నష్టం కలిగించలేదని, ఆ వార్తలు పూర్తిగా అబద్ధాలని కొట్టిపడేశారు. హైఫా ఓడరేవులో కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయని, ఆదివారం ఎనిమిది నౌకలు కార్యకాలాపాలను కొనసాగించాయని వారు తెలిపారు.

ఈ ఓడరేవులో దాదాపు 700 మంది ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్నారు. అదానీ పోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఓడరేవు ఆ దేశానికి అత్యంత ముఖ్యమైన దిగుమతుల కేంద్రంగా పని చేస్తోంది. ఇజ్రాయెల్ దిగుమతుల్లో 30 శాతానికి పైగా ఇక్కడి నుంచే జరుగుతాయి. ఈ పోర్ట్స్‌లో మన దేశానికి చెందిన అదానీ పోర్ట్స్ వాటా దాదాపు 70 శాతం. ఇజ్రాయెల్‌కు చెందిన గాడోట్ గ్రూప్‌ భాగస్వామ్యంతో ఈ ఓడరేవును అదానీ గ్రూపు నిర్వహిస్తోంది.

ఇవీ చదవండి:

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 07:18 AM