FMCG Business: ‘ఎఫ్‌ఎంసీజీ’కి అదానీ గుడ్‌బై
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:47 AM
ఎఫ్‌ఎంసీజీ వ్యాపారానికి అదానీ గ్రూప్ గుడ్‌బై చెప్పింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ (గతంలో అదానీ విల్మార్ లిమిటెడ్) ఈక్విటీలో తనకు ఉన్న 20 శాతం వాటాను సింగపూర్ భాగస్వామ్య సంస్థ...
అదానీ విల్మర్‌లో 20 శాతం వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ వ్యాపారానికి అదానీ గ్రూప్ గుడ్‌బై చెప్పింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ (గతంలో అదానీ విల్మార్ లిమిటెడ్) ఈక్విటీలో తనకు ఉన్న 20 శాతం వాటాను సింగపూర్ భాగస్వామ్య సంస్థ విల్మార్ ఇంటర్నేషనల్ కంపెనీకి రూ.7,150 కోట్లకు విక్రయించింది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పీ (ఏసీఎల్) ఈ వాటాలను విక్రయించింది. దీంతో ఏడబ్ల్యూఎల్ ఈక్విటీలో సింగపూర్ కంపెనీ వాటా 64 శాతానికి చేరింది. సింగపూర్ సంస్థ ఇందుకోసం ఒక్కో షేరుకు రూ.275 చొప్పున చెల్లించింది. కాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినె్‌సలో మిగిలిన 10.42 శాతం వాటాలను ఏసీఎల్ త్వరలో విక్రయించనుంది. ఈ ఏడాది జనవరిలోనే ఏడబ్ల్యూఎల్‌లో ఏసీఎల్ 13.51 శాతం వాటాలను రూ.4,855 కోట్లకు విక్రయించింది. కాగా గురువారం బీఎస్‌ఈలో ఏడబ్ల్యూఎల్ అగ్రి షేరు 6.06 శాతం లాభంతో రూ.278.25 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 05:47 AM