అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు రూ 6400 కోట్ల నిధులు
ABN, Publish Date - Jun 05 , 2025 | 04:39 AM
తదుపరి దశ విస్తరణ కోసం వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి 75 కోట్ల డాలర్ల (రూ.6,400 కోట్లు) నిధులు సమీకరించినట్టు అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్‌ఎల్)...
న్యూఢిల్లీ: తదుపరి దశ విస్తరణ కోసం వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి 75 కోట్ల డాలర్ల (రూ.6,400 కోట్లు) నిధులు సమీకరించినట్టు అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్‌ఎల్) ప్రకటించింది. కన్సార్షియంలో ఫస్ట్ అబూ దభీ బ్యాంక్, బార్‌క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులున్నాయి. 40 కోట్ల డాలర్ల (రూ.3,400 కోట్లు) ప్రస్తుత రుణభారం తగ్గించుకోవడంతో పాటు విమానాశ్రయాల వ్యాపారం, ఈ వ్యాపారానికి అనుబంధంగా గల నాన్ ఏరో వ్యాపారాల విస్తరణకు ఈ నిధులు ఉపయోగించుకోనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా అహ్మదాబాద్, లఖ్‌నవ్, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను విస్తరించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం తమ నిర్వహణలోని విమానాశ్రయాల వార్షిక ప్రయాణికుల రవాణా సామర్థ్యం 9.4 కోట్లుండగా దాన్ని 11 కోట్లకు పెంచుతామని తెలియచేసింది. 2040 నాటికి దశలవారీగా ఈ సామర్థ్యాన్ని 30 కోట్లకు పెంచడం తమ లక్ష్యమని కంపెనీ సీఈఓ అరుణ్ బన్సల్ తెలిపారు. త్వరలోనే ప్రారంభం కానున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం తొలి దశలో రెండు కోట్లుంటుందని, దశలవారీగా దాన్ని 9 కోట్లకు చేర్చాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 05 , 2025 | 04:39 AM