Adulterated Ghee Case: సుప్రీంకోర్టులో కల్తీ నెయ్యి పిటిషన్‌ను ఉపసంహరించుకున్న వైవీ సుబ్బారెడ్డి
ABN, Publish Date - Jul 23 , 2025 | 04:55 AM
తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఉపసంహరించుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఉపసంహరించుకున్నారు. ఈకేసులో సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విశ్రాంత న్యాయమూర్తి లేదా నిపుణులతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ గతనెల 11న వైవీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని, ఇతర న్యాయమార్గాలు పరిశీస్తున్నామని వైవీ తరఫున సీనియర్ న్యాయవాది చెప్పారు. పిటిషన్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
Updated Date - Jul 23 , 2025 | 04:57 AM