YSRCP: నకిలీ ఖాతాలతో పోస్టులు
ABN, First Publish Date - 2025-05-29T04:03:17+05:30
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత భర్గవ్‌రెడ్డి మంగళగిరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మరోసారి పిలిచే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
సజ్జల భార్గవ్‌రెడ్డి కేసులో పోలీసుల గుర్తింపు
విచారణలో పలు ప్రశ్నలకు జవాబులు దాటవేత
కొన్నింటికి తెలియదని సమాధానాలు
మళ్లీ విచారణకు పిలుస్తాం: దర్యాప్తు అధికారి
మంగళగిరి సిటీ, మే 28(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్‌రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు విచారణలో దాదాపు 30 ప్రశ్నలు సంధించగా చాలావాటికి సరైన సమాధానం ఇవ్వలేదు. మరికొన్నింటికి తెలియదని చెప్పినట్లు తెలిసింది. భార్గవ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి నకిలీ అకౌంట్ల ద్వారా పోస్టులు పెట్టించినట్టు గుర్తించామని మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. భార్గవ్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని, మరోమారు విచారణకు పిలిచే అవకాశం ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి పరారీలో ఉన్నాడని తెలిపారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - 2025-05-29T04:04:00+05:30 IST