YS Jayanthi: ఏయూలో వైఎస్ జయంతి వేడుకలు
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:09 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో కొంతమంది ఉద్యోగుల తీరు ఏమాత్రం మారలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీని నాటి పాలకులు అధికార పార్టీ రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
విధులు పక్కనబెట్టి విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఉద్యోగులు
విశాఖపట్నం, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో కొంతమంది ఉద్యోగుల తీరు ఏమాత్రం మారలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీని నాటి పాలకులు అధికార పార్టీ రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తరహా కార్యక్రమాలకు కొంతవరకూ అడ్డుకట్ట పడింది. అయితే.. మంగళవారం వైఎస్ జయంతి సందర్భంగా.. పది మంది వర్సిటీ ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సిన సమయంలో క్యాంప్‌సలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్దకు వచ్చి కేక్ కట్ చేసి, విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఇది చూసి మిగిలిన ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. వేడుకలు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే వీసీ, రిజిస్ర్టార్, రెక్టార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ విషయం వారి దృష్టికి వెళ్లిందో, లేదో... కానీ ఎవరూ పట్టించుకోలేదు.
Updated Date - Jul 09 , 2025 | 05:10 AM