ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: అంతర్గత టెర్రరిస్టుగా తయారైన చౌకీదార్‌

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:45 AM

కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల, ప్రధాని మోదీ, గృహ మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వ తప్పిదంగా పేర్కొన్నారు.

మోదీ వ్యవస్థలుగా మారిన నిఘా వ్యవస్థలు: షర్మిల

విశాఖపట్నం, ఏప్రి ల్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అంతర్గత టెర్రరిస్ట్‌ మాదిరిగా తయారయ్యారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోదీ వ్యవస్థలుగా మార్చేశారు. ఈ ఘటనకు అమిత్‌షా, మోదీ బాధ్యత వహించాలి. తక్షణమే రాజీనామా చేయాలి’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి గురువారం మధ్యాహ్నం ఆమె నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కశ్మీర్‌ ఘటన దేశంపై జరిగిన దాడిగా భావిస్తున్నాం. దేశానికి చౌకీదార్‌(చేతిలో స్టిక్‌ చూపిస్తూ...) అంటూ చెప్పుకునే మోదీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన బీజేపీకి మాత్రమే చౌకీదార్‌. దేశంలో ఇంటెలిజెన్స్‌ ఫెయిల్యూర్‌కు ఈ ఘటన నిదర్శనం. దేశ భద్రతను గాలికి వదిలేశారు. ముమ్మాటికీ ఈ ఘటన కేంద్రం తప్పిదమే. దేశంలోని ముస్లింలను చెడ్డవాళ్లగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయాడు. దేశంలో అంతర్గత భద్రత సరిగా లేదు’ అని షర్మిల విమర్శించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:45 AM