ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan Liquor Scam: కమీషన్ల కిక్కు జగన్‌ జేబులోకే

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:18 AM

వైఎస్‌ జగన్‌ మద్య నిషేధ హామీ ఇచ్చినప్పటికీ, మద్యం కమీషన్లపై పుట్టిన ఈ భారీ కుంభకోణాన్ని సిట్‌ అన్వేషించింది. లిక్కర్‌ సరఫరా, కమీషన్ల వసూళ్లకు చాణక్య పాత్ర, దీనికి సంబంధించి అనేక కీలక సంచలనాలు వెలుగులోకి వచ్చాయి.

‘సొంత లాభం’ కోసమే మద్యం పాలసీ

వసూలులో చాణక్యదే కీలక పాత్ర ఆయన నుంచి రాజ్‌ కసిరెడ్డికి నిధులు

సాయిరెడ్డి, మిథున్‌, బాలాజీ, వైఎస్‌ అనిల్‌ ద్వారా జగన్‌కు...

హైదరాబాద్‌లోని హోటల్లో స్కామ్‌కు బీజం

మద్యం కంపెనీలతో సజ్జల శ్రీధర్‌ భేటీ 12తో మొదలై 20 శాతానికి చేరిన కమీషన్‌

ముడుపులు ఇచ్చిన వారికే ఆర్డర్లు

చాణక్య రిమాండ్‌ రిపోర్టులో ‘సిట్‌’ వెల్లడి

రిమాండ్‌ విధింపు.. బెజవాడ జైలుకు తరలింపు

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌... అదే మద్యం నుంచి వేల కోట్ల కమీషన్లు పిండుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది. స్కామ్‌కు రాజ్‌ కసిరెడ్డి సూత్రధారి కాగా... కంపెనీల నుంచి కమీషన్ల వసూలులో ఆయన తోడల్లుడు చాణక్య కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఆయన... ఈ మొత్తాన్ని రాజ్‌ కసిరెడ్డికి అందించేవారని... అక్కడి నుంచి మిథున్‌రెడ్డి, సాయిరెడ్డి, బాలాజీ(భారతీ సిమెంట్స్‌), వైఎస్‌ అనిల్‌ రెడ్డిలకు చేరేవని తెలిపింది. వీరి ద్వారా వివిధ రూపాల్లో... అంతిమంగా అప్పటి సీఎం జగన్‌కు కమీషన్లు చేరేవని ‘సిట్‌’ వెల్లడించింది. వ్యక్తిగత, రాజకీయ లాభాల కోసం మద్యం వ్యాపారం నడపడాన్ని రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించింది. ఈ స్కామ్‌లో 300 నుంచి 400కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని, మరింత లోతుగా వ్యవహారం తేల్చేందుకు కీలకమైన వ్యక్తుల కస్టడీ ఎంతో అవసరమని తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న బూనేటి చాణక్యను అరెస్టు చేసిన సిట్‌ అధికారులు... ఆయన రిమాండ్‌ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపరిచారు. ఆ నివేదిక ప్రకారం... వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే... 2019 ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సజ్జల శ్రీధర్‌ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. మద్యం కుంభకోణానికి అక్కడే బీజం పడింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్‌ యజమానులను భేటీకి పిలిపించారు.


ఏపీకి లిక్కర్‌ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇందుకు కొందరు అంగీకరించారు. మరికొందరు నిరాకరించారు. కమీషన్లు ఇచ్చేందుకు సమ్మతించిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చి... ఆ సరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. ఈ వసూళ్లను సుమిత్‌ అనే వ్యక్తి పర్యవేక్షించారు. తర్వాత. చాణక్య రంగంలోకి దిగారు. చాకచక్యంగా, పకడ్బందీగా... వివిధ పేర్లతో అంతర్జాతీయ ఫోన్‌ నెంబర్లు, కాలింగ్‌ యాప్స్‌, వీపీఎన్‌లు వాడుతూ డిస్టిలరీస్‌ యజమానులతో లావాదేవీలు జరిపారు. వ్యాపారులకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి చెల్లింపులు చేసిన వెంటనే చాణక్య నుంచి ఫోన్లు వెళ్లేవి. తర్వాత రెండు రోజుల్లో కమీషన్‌ ముట్టచెప్పాల్సిందే. లేదంటే... తదుపరి ఆర్డర్లు ఆపేసేవారు. 12 శాతంతో మొదలైన వసూళ్లు 20శాతం వరకూ చేరాయి. నెలవారీ కమీషన్ల మొత్తం రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్లకు చేరింది. ఈ డబ్బులు బులియన్‌ వ్యాపారాలు, బోగస్‌ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌కు చేరాయి. బంగారు నాణేలు, గార్మెంట్స్‌, ప్రచార వస్తువుల పేరుతో జీఎ్‌సటీ ఇన్వాయి్‌సలు తీశారు. కానీ... అవేవీ రవాణా కాలేదని టోల్‌గేట్‌ డేటా ద్వారా తెలింది.


కమీషన్లు ఇస్తేనే...

జగన్‌ హయాంలో ఆదాన్‌ సుప్రీం, బ్రిలియంట్‌ బ్లెండ్‌, దారు హౌస్‌ బ్రాందీ, మాన్షన్‌ హౌస్‌(తిలక్‌ నగర్‌) మద్యాన్ని పుష్కలంగా విక్రయించారు. బాగాపేరున్న మెక్‌ డోవల్స్‌, ఇంపీరియల్‌ బ్లూ వంటివి పూర్తిగా ఆపేశారు. కమీషన్లు ఇచ్చేందుకు నిరాకరించడమే దీనికి కారణం. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018-19లో మెక్‌డోవల్స్‌ బ్రాందీ 22.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023-24నాటికి 5 లక్షల యూనిట్లకు పడిపోయినట్లు ‘సిట్‌’ తెలిపింది. ఇంపీరియల్‌ బ్లూ విస్కీ 20లక్షల నుంచి 7లక్షల యూనిట్లకు.. కింగ్‌ఫిషర్‌ బీరు కోటి నుంచి 11.8లక్షల యూనిట్లకు తగ్గిపోవడానికి కమీషన్లు చెల్లించక పోవడమే కారణమని వివరించింది.

చాణక్యకు రిమాండ్‌

విజయవాడ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో మరో నిందితుడికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడు, రాజ్‌ కసిరెడ్డి తోడల్లుడు బూనేటి చాణక్య అలియాస్‌ ప్రకాశ్‌ను సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్‌ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణంలో మొత్తం నగదు వ్యవహారాలను చాణక్య చక్కబెట్టారని, మద్యం డిస్టలరీస్‌ నుంచి కమీషన్లు వసూలుచేసి రాజ్‌ కసిరెడ్డికి వేర్వేరు మార్గాల ద్వారా చేర్చేవారని వివరించారు. వాదనలు విన్న న్యాయాధికారి పి.భాస్కరరావు... చాణక్య తరఫున్యాయవాదిని వాదనలు వినిపిస్తారా అని అడిగారు. వాదనలు వినిపించనని ఆయన చెప్పడంతో చాణక్యకు వచ్చేనెల 6 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:18 AM