ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెక్కలు కొట్టుకుంటున్నాయ్‌!

ABN, Publish Date - May 23 , 2025 | 01:51 AM

అధికారం కోల్పోయినా వైసీపీ నేతలకు గుణపాఠం రావడం లేదు. కొందరు తమ వైఖ రిని మార్చుకోకపోతుంటే.. కొందరు మధ్య ఆధి పత్య పోరు పెరిగింది.

వైసీపీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తి రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరైన నాయకులు

నాడు రాజా వర్సెస్‌ భరత్‌

నేడు వేణు వర్సెస్‌ భరత్‌

పరిశీలకుడు వచ్చినా గైర్హాజరు

మాజీ ఎంపీ తీరుపై అసహనం

ఇటీవల క్లాస్‌..మారని తీరు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

అధికారం కోల్పోయినా వైసీపీ నేతలకు గుణపాఠం రావడం లేదు. కొందరు తమ వైఖ రిని మార్చుకోకపోతుంటే.. కొందరు మధ్య ఆధి పత్య పోరు పెరిగింది. అధికారంలో ఉండగా, అప్పట్లో ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌రామ్‌, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజా మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు పొడచూపిన సంగతి తెలిసిందే. అయినా ఎవరికి వారు తమ వర్గాని పోషించుకుంటూ వచ్చారు. గత ఎన్ని కల్లో అందరూ ఓడిపోయారు. రాజమ హేంద్రవరం రూరల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏమి జరిగిందో కానీ మాజీ మంత్రి వేణు, మాజీ ఎంపీ భరత్‌ మధ్య గ్యాప్‌ బాగా పెరిగింది. కొద్ది రోజుల కిందట వీరి వ్యవహారం అధిష్ఠానం వద్ద పంచాయితీకి కూడా దారితీయడం గమ నార్హం. జగన్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరినీ పిలిచి క్లాస్‌ తీసుకున్నట్టు సమా చారం. వేణు జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుని పోకుండా, తనకు వ్యతిరేకంగా కొందరితో చేతులు కలిపినట్టు భరత్‌ ఆరోపిం చినట్టు తెలిసింది.కానీ తాను జిల్లా అధ్యక్షుడిగా చేపట్టిన కార్యక్రమాలు కాకుండా భరత్‌ ఒంటెత్తు పోకడతో వెళుతున్నట్టు వేణు వా దించినట్టు సమాచారం. కానీ అధిష్ఠానం వీరి ద్దరికి గట్టిగా చెప్పి పంపించడం గమనార్హం. కానీ అయినా వారి మధ్య సయోధ్య కుదిరినట్టు లేదు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ ఇన్‌చార్జి వైసీపీ పరిశీలకుడిగా తిప్పల గురుమూర్తి రెడ్డి గురువారం జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌ చార్జిలతో సమావేశం నిర్వహించారు. బొమ్మూ రులోని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు కార్యాలయంలో వేణు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమా వేశానికి మాజీ ఎంపీ మార్గాని భరత్‌ హాజరు కాలేదు. ఆయన హైదరాబాద్‌ వెళ్లినట్టు సమా చారం.సమావేశంలో మాజీహోం మంత్రి తానే టి వనిత, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్ల మెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డా.గూడూరి శ్రీనివాస్‌,మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సత్తి సూర్య నారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి. శ్రీని వాసనాయుడు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 01:51 AM