ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయండి

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:01 AM

మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధా కర్‌యాదవ్‌ పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌

మైదుకూరు రూరల్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధా కర్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. స్థాని క ఎంపీడీవో కార్యాలయం నుంచి డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యం లో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం అమ్మవారిశాల వద్ద ఏర్పాటు చేసి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్తుతో కుటుంబాలు చిత్తుచిత్తు అవుతున్నాయన్నారు. నియోజకవర్గం లో ఎక్కడైన గంజాయి, డ్రగ్స్‌ లాంటి మాదకద్రవ్యాలు ఉన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తరువాత స్థానిక స్రీ శక్తి భవనంలో 39 మంది ఆర్‌పీలకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని శివపురంలో రైతులకు వ్యవసాయశాఖ అధికారుల సమక్షంలో జీలుగలను, 80 శాతం సబ్సిడీలతో పంటలకు మందులను పిచికారి చేయడానికి డ్రోన్‌లను ఎమ్మెల్యే అందించారు. అవదూత పుల్లయ్యస్వామి తిరుణాల సందర్భంగా ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్య క్షుడు దాసరిబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర, మున్సిపల్‌ చైర్మన్‌ మాచ నూరు చంద్ర, పట్టణ ఉపాధ్యక్షుడు యాపరాల లక్ష్మినారాయణ, యూనిట్‌ ఇన్‌చార్జ్‌లు తుపాకుల రమణ, బండి అమర్‌నాధ్‌, సీఐ రమాణారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లేష్‌ మాజీ సర్పంచ్‌ శీర్ల నాగమోహన్‌, ఆలయ నిర్వాహకుడు హజరత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:01 AM