ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP MP Byrreddy Shabari: మహిళా నేతలకు ప్రజాజీవితం శిక్ష కాకూడదు

ABN, Publish Date - Jul 31 , 2025 | 05:05 AM

ప్రజాజీవితంలో ఉండే మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలను అరికట్టేందుకు, వారి ఆత్మగౌరవాన్ని రక్షించేందు కు ఒక చట్టాన్ని తీసుకురావాలని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

  • వారి ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు చట్టం తేవాలి: శబరి

  • లోక్‌సభ దృష్టికి వైసీపీ నేతల అభ్యంతరకర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రజాజీవితంలో ఉండే మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలను అరికట్టేందుకు, వారి ఆత్మగౌరవాన్ని రక్షించేందు కు ఒక చట్టాన్ని తీసుకురావాలని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహిళా నేతల పట్ల అసభ్య వ్యాఖ్యలను ఇకపై సహించబోమని, మహిళలకు న్యాయం త్వరగా అందించేందుకు పార్లమెంటులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. లోక్‌సభలో బుధవారం ఆమె మాట్లాడుతూ ఏపీలో టీడీపీ మహిళా నేతల గౌరవానికి భంగం కలిగించేలా వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజాజీవితం మహిళలకు ఎప్పుడూ శిక్ష కాకూడదన్నా రు. అసభ్య పదజాలంతో మహిళలను కించపరచడం లైంగిక దాడితో సమానమన్నారు.మరోవైపు తన నంద్యాల నియోజకవర్గంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు శబరి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 31 , 2025 | 05:06 AM