ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు

ABN, Publish Date - Jul 16 , 2025 | 04:17 AM

కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హైకోర్టు తీవ్రంగా మందలించింది.

  • ఆమెపై మీ వ్యాఖ్యలను ఉపేక్షించలేం

  • మహిళా నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా?

  • మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్‌ సృష్టించారు

  • మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. నియంత్రణలో ఉండండి

  • ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ప్రసన్నకుమార్‌రెడ్డిని మందలించిన హైకోర్టు

  • వైసీపీ నేత ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

‘‘మాజీ ఎమ్మెల్యే అయిఉండి అవేం మాటలు? ఒక మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవమిదేనా? మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్‌ సృష్టించారు. వాటిని ఉపేక్షించలేం. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.’’

- హైకోర్టు సీరియస్‌

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటని నిలదీసింది. ‘ఓ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి, ప్రస్తుత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? మహిళా నేతను గౌరవించేది ఇలాగేనా? అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండండి.. మీ వ్యాఖ్యతో న్యూసెన్స్‌ చేశారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి’ అంటూ హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది సుభోద్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. పిటిషనర్‌ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని న్యాయవాది సుభోద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ప్రసన్నకుమార్‌ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 16 , 2025 | 04:19 AM