ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంపద సృష్టి జరిగేనా..?

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:57 PM

కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు చెదలు పట్టాయి.

కొలిమిగుండ్లలో నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రం

· గత ఆరేళ్లుగా చెత్త సంపద

కేంద్రాలకు చెదలు

· టీడీపీ ప్రభుత్వం దృష్టి

సారించాలని కోరుతున్న ప్రజలు

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు చెదలు పట్టాయి. స్వచ్ఛా భారత స్ఫూర్తితో చెత్త నుంచి సంపద సృష్టించ డానికి 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొలిమిగుండ్ల, మీర్జాపురం, పేట్నీ కోట, ఇటిక్యాల, అంకిరెడ్డిప ల్లె, బెలుం, చింతలా యపల్లె తదితర సుమారు 22గ్రామాల్లో రూ. కోట్లు వెచ్చించి వర్మీకంపోస్టు యూనిట్లు నిర్మిం చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను విధించడంలో కనబరచిన ఆసక్తిని సేక రించి, సంపద సృష్టించడంలో చూపలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలకు చెత్త కష్టాలు తప్పడం లేదు. ప్రధా నంగా కొలిమిగుం డ్ల మండల కేంద్రంలో గ్రామాని కి దూరంగా డంపింగ్‌యార్డు కేంద్రాన్ని నిర్మించ డం, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తో చెత్త సేకరణ జరడం లేదు. దీంతో ప్ర జలు తమ ఇళ్లల్లోని చెత్త ను కాల్వల్లోనూ, ప్రధాన రహదారుల పక్కన పడే స్తుండడంతో చెత్త సంపద కేంద్రాలకు చెత్త వెళ్లడం లేదు. దీంతో అవి నిరుప యోగంగా మారి శిథి లా వస్థకు చేరుకుంటు న్నాయి. అయితే రాష్ట్రంలో తిరిగి మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో చెత్త సంపద సృష్టిపై ఆశలు రెకెత్తుతున్నాయి. ఇప్పటికే చెత్త సంపద కేంద్రాలపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలని ప్రభు త్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అధికా రులు పేర్కొంటున్నారు. కింది స్థాయి అధికారులు త్వరిత గతిన చర్యలు చేపట్టి చెత్త సంపద కేంద్రాలను అందుబాటులోకి తీసుక రావాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:57 PM