ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీమా వస్తుందోచ..!

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:43 PM

రాష్ట్రప్రభుత్వం అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స కంపెనీ ఆఫ్‌ ఇండియా ద్వారా పంట నష్టం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులను ఆదుకునేందుకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఈ ఖరీఫ్‌లో అమలు చేస్తోంది.

అరటి ఇలా దెబ్బతిన్నప్పుడు భీమా వర్తిసుంది.

పంట బీమా పథకానికి నంద్యాల జిల్లా ఎంపిక

అరటి, పత్తి, వేరుశనగ పంటలకు భీమా సౌకర్యం

ఈ ఏడాది ఖరీఫ్‌లో అమలు

నంద్యాల ఎడ్యుకేషన, జూన 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స కంపెనీ ఆఫ్‌ ఇండియా ద్వారా పంట నష్టం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులను ఆదుకునేందుకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఈ ఖరీఫ్‌లో అమలు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపురం, డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ జిల్లా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాను ఈఏడాది ఖరీఫ్‌కు ఎంపిక చేసింది.

బీమాకు అర్హులు ఎవరు

వ్యవసాయ భూమి కల్గిన రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తూనే రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఈ ఖరీఫ్‌లో కౌలుదారులకు బీమా వర్తించేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలై 1నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు అకాల వర్షాలు, అఽధిక వర్షపాతం, చీడపీడల వా తావరణం నమోదై పంటలు దెబ్బతిన్నట్లయితే బీమా సొమ్ము చెల్లిస్తారు. 2026 మార్చి నుంచి మే 31వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతతో దెబ్బతిన్న పంటలకు బీమా వర్తిస్తుంది. అధికంగా గాలులు వీచే ఈఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 2026 మే 31వ తేదీరకు గాలుల వల్ల దెబ్బతిన్న పంటలకు కూడా బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 1వతేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గాలిలో తేమశాతం వల్ల నష్టపోయే పంటలకు కూడా బీమా వర్తించేలా రూపొందించారు

నష్టపరిహారం అంచనా

ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 మే 31వ తేదీ వరకు సంవత్సర కాలం మధ్య అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం, అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించిన పరిణామాలను మండల స్థాయిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ వాతావరణ పరికరాలతో లెక్కించి వచ్చిన తేడా ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు.

రైతులు చెల్లించాల్సిన ప్రీమియం ఇలా..

పత్తికి ఎకరాకు బీమా మొత్తం రూ.40వేలు కల్పించగా రైతు ఎకరాకు రూ.1900లను ప్రీమియంగా చెల్లించాలి. వేరుశనగకు ఎకరాకు బీమా మొత్తం రూ.28వేలు కాగా రైతు ఎకరాకు రూ.560 ప్రీమియంగా చెల్లించాలి. అరటికి ఎకరాకు బీమా మొత్తం రూ.55వేలు కల్పించగా రైతు ఎకరాకు రూ.2750 కట్టాలి. స్థానిక రైతు సేవాకేంద్రంలో కాని, ఉద్యా నశాఖ అధికారులకు గాని జులై 15వ తేదీ లోపు ప్రీమియం చెల్లించాల్సి వుంది.

కావాల్సిన పత్రాలు

బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, భూమి పాస్‌బుక్‌, పంట వేసినట్లు ధ్రువీకరణ పత్రం (రైతు సేవాకేంద్రాల్లో గ్రామీణ వ్యవసాయ సహాయకులు కాని, గ్రామీణ ఉద్యాన సహాయకులు కాని ఇచ్చిన పత్రాలు)

మన రైతుల అదృష్టం

నంద్యాల జిల్లా బీమా సౌకర్యానికి ఎంపిక కావడం మన రైతుల అదృష్టం. రైతులు అరటి, పత్తి, వేరుశనగ పంటలకు తప్పకుండా ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం పొందాలి. విపత్కర పరిస్థితుల్లో పంటలు నష్టపోతే బీమా ద్వారా ఊరట కలుగుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకుంటున్నారని ఆశిస్తున్నాము.

ఫ నాగరాజు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నంద్యాల

Updated Date - Jun 15 , 2025 | 11:43 PM