ఆటో డ్రైవర్ల తీరు మారదా..?
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:07 AM
ప్రొద్దుటూరు పట్టణ వీధుల్లో ట్రాఫిక్ గందర గోళానికి ఆటోలు ఒక ప్రధాన కారణమవుతు న్నాయి.
ప్రధాన రోడ్లపై అడ్డదిడ్డంగా
ఆటోల నిలుపుదల
ట్రాఫిక్‌కు తప్పని తిప్పలు
ప్రమాదాలు జరిగితేకాని
స్పందించరా అంటున్న జనం
ప్రొద్దుటూరు అర్బన జూన 27(ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు పట్టణ వీధుల్లో ట్రాఫిక్ గందర గోళానికి ఆటోలు ఒక ప్రధాన కారణమవుతు న్నాయి. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేక పోవడమా లేక నిర్లక్ష్యమో తెలియదు కాని ఆటో డ్రైవర్లు ఆటోలను ప్రధాన రోడ్లపైనే అడ్డ దిడ్డంగా నిలిపివేయడం. అనుచిత డ్రైవింగ్ ప్ర వర్తనలు ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిసు ్తన్నాయి. ప్రతి కూడలిలోనూ, బస్టాప్‌ల దగ్గర, పాత బస్టాండ్, బీవీఎస్ థియేటర్, అన్వర్ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్, ఆస్పత్రుల వద్ద ఆటోలు నిలిపే దృశ్యాలు ఇబ్బందికరంగా ఉం టున్నాయి. ప్యాసింజర్ దొరికితే చాలు ఎక్కడైన వెనుకా ముందు చూడకుండా ఆగడంతో ట్రాఫి క్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొన్ని సమ యాల్లో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. ఒక వేళ ట్రాఫిక్ పోలీస్ జారీ చేసిన చలానా ఉంటే తప్ప కొందరైతే చెబితే వినే పరిస్ధితి లేదు.
ఆటో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి
నగర పాలక సంస్ధ వారు ఆటోడ్రైవర్లకు ప్రత్యే కంగా ట్రాఫిక్ శిక్షణ ఇవ్వడంతోపాటు జీపీఎస్ ఆధారంగా ఆటోలపై నిఘా పెట్టే టెక్నాలజీని వినియోగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజావేదికల ద్వారా సమస్య నియంత్రణకు పాటుపడాలని కోరుతున్నారు.
ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం
ప్రొద్దుటూరులో ట్రాఫిక్ ని యంత్రణకు ఎప్పటికప్పడు తనిఖీలు చేపడుతున్నాం. ప్రతి రోజూ 25వేల వాహ నాలు రాకపోకలు సాటిస్తుం డడంతో ట్రాఫిక్ సమస్యగా మారింది. ఆటో డ్రైవర్లకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. పట్టణంలో పాతబస్టాండ్ ఎదు రుగా, బీవీఎస్, ఆరవేటి థియేటర్లతోపాటు త్యాగరాజరెడ్డి హాస్పిటల్ వద్ద బస్సులు అధిక సమయం నిలిపివేయడం కూడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజలు సహక రించాలి.
-దేవకుమార్, ట్రాఫిక్ సీఐ
Updated Date - Jun 28 , 2025 | 12:07 AM