ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కోట్ల

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:18 PM

సిమెంటునగర్‌ గ్రామంలోని పాణ్యం సిమెంటు ప్యాక్టరీ పునఃప్రారంభమయ్యే వరకు ప్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటానని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి

బేతంచెర్ల, జూన 2 (ఆంధ్రజ్యోతి): సిమెంటునగర్‌ గ్రామంలోని పాణ్యం సిమెంటు ప్యాక్టరీ పునఃప్రారంభమయ్యే వరకు ప్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటానని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ప్యాక్టరీ గేట్ల ముందు కార్మికులు, నిరుద్యోగులు ని ర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్యాక్టరీని తిరిగి ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కార్మికులకు యాజమాన్యం ఇవ్వాల్సిన పెండింగ్‌ వేతనాలను ఇతర బకాయిలను వెంటనే చెల్లించాల న్నా రు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించి ప్యాక్టరీ పునఃప్రారంభం కోసం తన వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్లనాగయ్య, సీనియర్‌ నాయకురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, పో లూరు రాఘవరెడ్డి, చంద్రశేఖర్‌, ఉన్నం సుధాకర్‌, మేకల నాగరాజు, రూబెన, కార్మికులు, టీడీపీ నాయకులు రాముడు, ఉరుకుందు, వాసు పాల్గొన్నారు.

గ్రామ సచివాలయం పరిశీలన

సిమెంటునగర్‌లోని సచివాలయం-2ను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం నిర్మాణంలో నిబంధనలు పాటించకుండా పనులు చేశారన్నారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టరుపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

Updated Date - Jun 02 , 2025 | 11:18 PM