ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

West Godavari Family: నా భార్యను తుర్కియే నుంచి కాపాడండి

ABN, Publish Date - Jul 08 , 2025 | 07:01 AM

బతుకు తెరువు కోసం తుర్కియే(టర్కీ) వెళ్లిన తన భార్య, చిత్రహింసలు అనుభవిస్తోందని, ఆమె ను కాపాడాలని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అగ్రహారానికి చెందిన మద్దా దానియేలు తాడేపల్లిగూడేనికి చెందిన...

  • కైండ్‌నెస్‌ సొసైటీని ఆశ్రయించిన పశ్చిమ జిల్లావాసి

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): బతుకు తెరువు కోసం తుర్కియే(టర్కీ) వెళ్లిన తన భార్య, చిత్రహింసలు అనుభవిస్తోందని, ఆమె ను కాపాడాలని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అగ్రహారానికి చెందిన మద్దా దానియేలు తాడేపల్లిగూడేనికి చెందిన కైండ్‌నెస్‌ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు విన్నవించారు. ఏడు నెలల క్రితం తన భార్య రహేలు ఖతార్‌ వెళ్లగా, అక్కడి ఏజెంట్‌ మోసం చేసి తుర్కియే పంపించారన్నారు. తుర్కియేలో యజమాని తన భార్యకు అన్నం కూడా పెట్టకుండా గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నారని, అది తెలిసి తన పిల్లలిద్దరూ బెంగ పెట్టుకున్నారని వాపోయాడు. రహేలు తండ్రి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, తన భార్యను రక్షించాలని కోరారు. ఎంబసీతో సంప్రదించి వీలైనంత త్వరగా రప్పిస్తానని మాణిక్యాలరావు హామీ ఇచ్చారు.

Updated Date - Jul 08 , 2025 | 07:01 AM