Widower Pension: భార్య చనిపోయిన భర్తకు పింఛన్ ఇప్పించరూ
ABN, Publish Date - Jul 20 , 2025 | 04:35 AM
భర్త చనిపోయిన మహిళకు ఇచ్చే వితంతు పింఛను మాదిరిగా భార్య చనిపోయిన భర్తకు కూడా పింఛను ఇవ్వాలంటూ.. టీడీపీ కార్యకర్త ఒకరు చిత్రమైన విన్నపం చేశారు.
ఎమ్మెల్యే శ్రావణిశ్రీకి టీడీపీ కార్యకర్త చిత్రమైన వినతి
బుక్కరాయసముద్రం, జూలై 19(ఆంధ్రజ్యోతి): భర్త చనిపోయిన మహిళకు ఇచ్చే వితంతు పింఛను మాదిరిగా భార్య చనిపోయిన భర్తకు కూడా పింఛను ఇవ్వాలంటూ.. టీడీపీ కార్యకర్త ఒకరు చిత్రమైన విన్నపం చేశారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యాక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పూట్లూరు మండలం తక్కలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త ఫించన్‌లు ఇప్పించాలని పలువురు వితంతువులు ఎమ్మెల్యేకి విన్నవించారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్త విజయ భాస్కర్ రెడ్డి, తన భార్య ఏడాది కిందటే మృతిచెందారని, తనకు కూడా పింఛన్ ఇప్పించాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ‘మీ బాధ నాకు అర్థమైంది. భార్యలను కోల్పోయిన భర్తలకు పింఛన్ ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతాను’ అని హామీ ఇచ్చారు.
Updated Date - Jul 20 , 2025 | 04:36 AM