ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారం ‘స్కామర్‌’ ఎక్కడ?

ABN, Publish Date - May 31 , 2025 | 01:08 AM

ప్రజల ఆశలను ఒక ఆయుధంగా చేసుకుని ఓ పక్క బంగారం, మరోపక్క నగదు చీటీలు నిర్వహించి ఖాతాదారులను నిలువునా ముంచేసిన ముచ్చెర్ల శ్రీనివాసరావు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ముచ్చెర్ల మోసం విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని చర్చ జరుగుతోంది. బాధితుల్లోకి కొందరు కోవర్టులను పంపి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు సమాచారం.

గోల్డ్‌ బిస్కట్లతో చీటీలు నిర్వహించి ఖాతాదారులను ముంచిన ముచ్చెర్ల శ్రీనివాసరావు

అతని కోసం విస్తృతంగా పోలీసుల గాలింపు

స్టేషన్‌కు పెరుగుతున్న బాధితుల సంఖ్య

కోవర్టుల ద్వారా ఇక్కడి సమాచారం తెలుసుకుంటున్న నిందితుడు

మోసం విలువ రూ.వందల కోట్లు అంటున్న బాధితులు

ప్రజల ఆశలను ఒక ఆయుధంగా చేసుకుని ఓ పక్క బంగారం, మరోపక్క నగదు చీటీలు నిర్వహించి ఖాతాదారులను నిలువునా ముంచేసిన ముచ్చెర్ల శ్రీనివాసరావు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ముచ్చెర్ల మోసం విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని చర్చ జరుగుతోంది. బాధితుల్లోకి కొందరు కోవర్టులను పంపి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు సమాచారం.

ఆంధ్రజ్యోతి-విజయవాడ :

25 మందితో గ్రూపును ఏర్పాటు చేసి, అందులో ఇద్దరు విజేతలను డ్రా ద్వారా ఎంపిక చేసి, గ్రాము బంగారం ఇచ్చి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన ముచ్చెర్ల శ్రీనివాసరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీనివాసరావు చేసిన మోసాలపై మొత్తం 67 మంది బాధితులు అజిత సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో 20 మంది వాంగ్మూలాన్ని పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. ముచ్చెర్ల చేసిన మోసం గురించి తెలుసుకుని బాధితులు ఒక్కొక్కరు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నారు.

హైదరాబాద్‌లో సమాలోచనలు!

శ్రీనివాసరావు విజయవాడలో దుకాణం సర్దేసి హైదరాబాద్‌ పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు సంకెళ్లు వేయకుండా తప్పించుకునే మార్గాలపై న్యాయవాదులతో అక్కడ సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి విజయవాడలో ఉన్న కుటుంబ సభ్యులతో వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడుతున్నట్టు సమాచారం. విజయవాడలో ఇంటి వద్ద, పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న పరిణామాలను కుటుంబ సభ్యులు, స్నేహితులను అడిగి తెలుసుకుంటున్నట్టు తెలిసింది. తనకు సంబంధించిన కొంతమందిని బాధితుల్లోకి కోవర్టులుగా శ్రీనివాసరావు వదిలాడని, బాధితుల మాదిరిగా పోలీసుల వద్దకు వెళ్లి స్టేషన్‌లో విషయాలను తెలుసుకుని శ్రీనివాసరావుకు కొంతమంది చేర్చుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక లావాదేవీలపై దృష్టి

ఒక మీడియా సంస్థకు చెందిన వ్యక్తి అత్యధికంగా రూ.కోటి వరకు శ్రీనివాసరావుకు ఇచ్చాడు. ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించిన బాధితుల్లో ఆయనే ఎక్కువ మొత్తంలో చెల్లించాడు. ఈ వాంగ్మూలాల నమోదు పూర్తవ్వగానే శ్రీనివాసరావు ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించాలని పోలీసులు నిర్ణయించారు. ఆయనకు ఏయే బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయో గుర్తించి, ఆ సంస్థలకు పోలీసులు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ ఖాతాలను స్తంభింపచేయాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు. శ్రీనివాసరావు చేసిన మోసం విలువను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. కొంతమంది బాధితులు రూ.100 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. మరికొంత మంది రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీనివాసరావు అంతిమంగా ఎంత మేరకు కుచ్చుటోపీ పెట్టాడో ఇప్పట్లో చెప్పలేమని, దీనికి కొంత సమయం పడుతుందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - May 31 , 2025 | 01:08 AM