బై..బై.. వైసీపీ
ABN, Publish Date - May 23 , 2025 | 12:41 AM
జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. వైసీపీలో తొలి నుంచీ పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలుగా పార్టీకి బై బై చెబుతున్నారు.
పార్టీని వీడుతున్న కీలక నేతలు.. కార్యకర్తలు
ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పార్టీ ఖాళీ
భీమవరం నియోజకర్గంలో నాయకత్వం లేదు
జిల్లాలో ముఖ్యనేతలు, కార్యకర్తల వలస
టీడీపీ, జనసేన పార్టీలకు క్యూ కట్టిన కేడర్
ఆచితూచి వ్యవహరిస్తున్న టీడీపీ
జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. వైసీపీలో తొలి నుంచీ పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలుగా పార్టీకి బై బై చెబుతున్నారు. ఒకరి వెంట ఒకరు కూటమి పార్టీల వైపు క్యూ కడుతున్నారు. ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పార్టీ దాదాపు ఖాళీ అయింది. మిగిలిన చోట్ల పార్టీ క్యాడర్ స్తబ్దతగా ఉన్నారు. జిల్లాలో బలమైన నాయకత్వం లేకపోవడం, స్థానిక నాయకత్వంపై ఉన్న అసంతృప్తులతో వైసీపీకి కోలుకోలేని దెబ్బతగులుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వైసీపీ దుకాణం క్రమేపీ ఖాళీ అవుతోంది. ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖాళీ అయింది. ఉండి నియోజకవర్గంలో ప్రధాన కేడర్ అంతా పార్టీని వీడింది. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో సహా కీలక నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరింత మంది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కలసి పార్టీలో చేరే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేడర్ ఉండి నియోజకవర్గంలో పటిష్టంగా ఉంది. ఒకవైపు రఘురామకృష్ణంరాజు, మరోవైపు జిల్లా అధ్యక్షు డు మంతెన రామరాజు పార్టీని పటిష్టం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషి స్తున్నారు. ఇవన్నీ వైసీపీని ఉండి నియోజకవర్గంలో చావు దెబ్బ తీశాయి. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంది శ్రీనివాస్ రాజీనామా చేయడంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు లేరు. గ్రంధి అనుచరవర్గం వైసీపీకి దూరంగా ఉంటోంది. ఇప్పటి దాకా వేరొకరికి బాధ్యతలు అప్పగించలేని దుస్థితిలో అధినాయకత్వం ఉంది. తెలుగుదేశం కూటమికి ప్రత్యామ్నా యంగా బలమైన నాయకుడు వైసీపీకి దొరకడం లేదు. దాంతో భీమవరం నియోజకవర్గంపై వైసీపీ అధిష్ఠానం చేతులెత్తేసి నట్టు కనపడుతోంది. జగన్‌మోహన్ రెడ్డికి విశ్వాసపాత్రునిగా ఉన్న భీమవరం కీలక నాయకులకు అధిష్ఠానం నుంచి ఎటు వంటి సంకేతాలు రావడం లేదు. భీమవరం నియోజకవర్గంలో వైసీపీని ఇది మరింత బలహీనపరిచింది. కేడర్ కూడా పార్టీకి దూరంగా ఉంటుంది. స్థానిక నాయకత్వం లేకపోవడంతో వైసీపీ శ్రేణులు కినుకవహించాయి. గ్రంధి రాజీనామాతోనే భీమవరంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది.
తాడేపల్లిగూడెంలో ఝలక్
తాడేపల్లిగూడెం అర్బన్: నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. నాలుగు రోజుల క్రితమే పెంటపాడు మండలంలో పది మంది ఎంపీటీసీ సభ్యులు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. మండలంలో రాజకీయ సమీకరణలు మార్చేందుకు జనసేన పావులు కదుపుతోంది. తెలుగేశం పార్టీతోనూ గ్రామస్థాయి ముఖ్య నాయకులు టచ్‌లో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం ఆచితూచి అడుగులు వేస్తోం ది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. దాంతో వైసీపీ నుంచి చేరేందుకు ఆసక్తి చూపుతున్నా అధిష్ఠానం దృష్టిలో పెట్టి ఆహ్వానించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ కేడర్ ఆ పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. అధికారంలో ఉన్న ప్పుడు తమను పట్టించుకోలేదని కొందరు, ఒక్క నాయకుడే తన స్వార్థం చూసుకున్నారని ఇంకొందరు దూరంగా ఉంటున్నా రు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో పనిచేయలేమంటూ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు బాహాటంగా చెప్పారు. తెలుగుదేశం కూటమి నాయకులను కలసి వైసీపీ కేడర్ తమ గోడును వెళ్లబోసుకునే పరిస్థితులు తాడేపల్లిగూడెం నియోకవర్గంలో నిత్య కృత్యమైపో యాయి. వైసీపీకి అత్యంత విధేయమైన కేడర్ కూడా పార్టీకి దూరమైపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం, జనసేన నుంచి పార్టీని వీడలేదు. వైసీపీలో చేరలేదు. కానీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి కూటమిలోకి వలసలు పెరిగిపో యాయి. ఇలా జిల్లాలో వైసీపీకీ గట్టి దెబ్బ త గులుతోంది.
నరసాపురంలో వైసీపీకి షాక్
జనసేన గూటికి ఇద్దరు కౌన్సిలర్లు
నరసాపురం టౌన్, మే 22 (ఆంధ్రజ్యోతి): నరసాపురం పురపాలక సంఘంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రెండు నెలల క్రితం 19వార్డు కౌన్సిలర్ కేసరపు గంగరాజు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా 27వార్డు కౌన్సిలర్ గోరు రమాదేవి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరు గురువారం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరారు. వీరికి మద్దతుగా మాజీ కౌన్సిలర్ గోరు సత్తిబాబు, మరో 100 మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి నాయకర్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, దీనితో చాలా మంది వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరావు, వలవల నాని, మైలా వసంతరావు, గుబ్బల మార్రాజు, ఆకన చంద్రశేఖర్, రవీంద్ర, వాతాడి కనకరాజులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:41 AM