ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్పీడ్‌ యుగంలో కూడా ఆగని సైకిల్‌

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:33 AM

చక్రం కనుగొనడంతోనే మానవ నాగరికత అభివృద్ధి చెందింది. చెక్కతో చక్రం తయారు చేసి వాటిని రథాలు, బండ్లకు అమర్చి గుర్రాలు, ఎద్దులు, దున్నలతో లాగించడం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం మొదలైంది.

నేడు ప్రపంచ సైకిల్‌ దినం

గ్రామీణ ప్రాంతాల్లో వన్నె తగ్గని సైకిల్‌

పాఠశాల విద్యార్థులు, పిల్లలకు సరదా సరదా

సైక్లింగ్‌తో మంచి ఆర్యోగ్యం, పర్యావరణ హితం

చక్రం కనుగొనడంతోనే మానవ నాగరికత అభివృద్ధి చెందింది. చెక్కతో చక్రం తయారు చేసి వాటిని రథాలు, బండ్లకు అమర్చి గుర్రాలు, ఎద్దులు, దున్నలతో లాగించడం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం మొదలైంది. క్రమేపీ సైకిల్‌ తయారీతో మనిషి ప్రయాణం వేగం అందుకుంది. సామాన్యులకు సైకిల్‌ ఎంతో చేరువ అయింది. అంతేకాదు పూర్వ కాలం సైకిల్‌ హోదా. వివాహ సందర్భంగా, పండుగలకు అల్లుళ్లకు సైకిల్‌ కానుకగా ఇవ్వడం ఒక ఆచారంగా సాగింది. ప్రస్తుతం సైకిల్‌ను మించిన వేగంతో మోటార్‌ వాహనాల రాకతో సైకిల్‌ వెనుకబడింది. అయినప్పటికీ సైకిల్‌ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. పాఠశాల పిల్లలకు సైకిల్‌ ఎంతో సరదా.. పెద్దలు సైకిల్‌ తొక్కడం ఆరోగ్యం అని వైద్యులు సూచిస్తున్నారు. మే 3 ప్రపంచ సైకిల్‌ దినం సందర్భంగా..

తణుకు రూరల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): సైకిల్‌ పర్యావరణానికి హాని కలగని సామాన్యుని ప్రయాణ సాధనం. ఎంత ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా సైకిల్‌ ప్రయాణం ఆగలేదు. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని మరీ సైకిల్‌ పరుగులు తీస్తోంది. సంప్రదా య సైకిల్‌తో పాటు గేర్‌, మోటార్‌ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. సైకిల్‌ తొక్కడం ద్వారా మనిషికి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని ఉండదు. 2018లో ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ మే 3న ప్రపంచ సైకిల్‌ దినంగా ప్రకటిం చింది. సైకిల్‌ తొక్కడం వలన ఆరోగ్య ప్రయోజనాలతో ఇంధనంతో నడిచే కార్లు, మోటారు సైకిల్‌ వల్ల వెలువడే కాలుష్య కారకాలను కొంతైనా తగ్గించాలనేది సైకిల్‌ దినోత్సవ లక్ష్యం.

సైకిల్‌ ఒకప్పటి సౌకర్యవంతమైన విలాసవంతమైన ప్రయాణ సాధ నం, మొదటి తరం సైకిల్స్‌లో ర్యాలీ, అంబర్‌, రిడ్జి, ఏవన్‌, ఉండేవి. 90 దశకం వరకూ ర్యాలీ, అంబర్‌, రిడ్జి సైకిళ్లు అప్పటి తరాన్ని ఎంతో ఆక ర్షించాయి. వాటిలో కొన్ని పూర్తిగా కనుమరుగైతే మరికొన్ని వేరే పేర్లతో రూపాంతరం చెందాయి. తర్వాత వచ్చిన హీరో, బీఎస్‌ఏ సైకిల్‌ సైకిల్స్‌ వినియోగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. కొత్తగా ఎన్ని రకాలు సైకిల్స్‌ అందుబాటులో వున్నా పాత తరం ర్యాలీ, అంబర్‌, రిడ్జి, ఏ వన్‌ సైకిళ్లను ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. కొంతమందికి మోటారు సైకిల్‌, కార్లు ఉన్నప్పటికీ పాత సైకిల్‌ మరమ్మతు చేయిం చుకుని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాత ర్యాలీ, అంబర్‌, రిడ్జి వంటి సైకిళ్లను కొనుగోలు చేసి మరమ్మతు చేయించుకుంటున్నారు. ఒక్కో పాత సైకిల్‌ను రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ వెచ్చించి నేటికీ కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు పూర్వీకులు నుంచి వచ్చిన సైకిళ్లను జాగ్రత్తగా వాడుకుంటున్నారు. కొత్త రకం సైకిల్స్‌ ఎన్ని హంగులతో వచ్చినా వారు ర్యాలీ, అంబర్‌ సైకిల్‌నే వాడతారు.

సైకిల్‌ ప్రస్థానం ఇదీ..

చెక్క సైకిల్‌ అనేక రూపాంతరాలతో ప్రస్తుత సైకిల్‌ అందుబాటు లోకి వచ్చింది. 1850 నుంచి ఇటలీ, స్కాట్‌లాండ్‌, జర్మనీ ఇంజనీర్లు సైకిల్‌ తయారీ ప్రారంభించారు. మొదటి తరం సైకిల్‌కి ఒకే చక్రా నికి ఫెడల్‌ అమర్చి ఉండేది. తర్వాత రెండు చక్రాల సైకిల్‌ తయా రు చేశారు. వెనక చక్రానికి ఫెడల్‌ అమర్చి ముందు చక్రం పెద్దగా ఉండేది. తర్వాత 1890లో జెన్‌ స్టాన్లీ రోవర్‌ సైకిల్‌ను తయారు చేశారు. ప్రస్తుతం మన వాడుతున్న రెండు చక్రాల మధ్యలో ఫెడల్‌ సైకిల్‌ సౌకర్యవంతంగా ఉండడంతో ప్రపంచమంతా వాడుకలోకి వచ్చింది. 1920లో పిల్లల కోసం ప్రత్యేకంగా సైకిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అనంతంర 1960లో రేసింగ్‌ సైకిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మోటారు సైకిల్స్‌ మాదిరి గేర్‌ సైకిల్స్‌, బ్యాటరీ సైకిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

మా పెళ్లికి బహుమతి సైకిల్‌.. ఇప్పటికీ వాడుతున్నా

సుమారు 56 ఏళ్ల క్రితం అత్తింటి వారు సైకిల్‌ బహుమతిగా ఇచ్చారు. అప్పటికే అది పాత సైకిల్‌. అదే సైకిల్‌ ఇప్పటికీ వాడుతున్నాను. నేను పాఠ శాలకు వెళ్లలేదు. కొంచెం వయస్సు వచ్చిన తర్వాత పొలం వెళ్లి పని చేయడం అలవాటు చేసుకు న్నాను. సైకిల్‌పై పొలం వెళ్లే వాడిని. మొదటి నుంచీ సైకిల్‌పైనే రాకపోకలు. బందువుల ఇంటికి వెళ్లాలన్నా.. ఇతర దూర ప్రాంతాలకు సైతం సైకిల్‌పై ప్రయాణం చేసేవాడిని. 56 ఏళ్ల నుంచి నా సైకిల్‌ ఎప్పుడు మరమ్మతుకు గురైనా కొత్త పార్ట్‌లు వేయడం తప్ప ఇప్పటికీ మార్చలేదు. ఉత్సాహంగా సైకిల్‌పై పొలం వెళతాను. ఊరిలో తిరుగుతాను. రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది.

– రెడ్డి వెంకట కృష్ణారావు, వేల్పూరు

సైకిల్‌ షాపుతో జీవనం.. ముగ్గురిని చదివించా

మా తండ్రి బాబూరావు స్థాపించిన సైకిల్‌ షాపులో పని నేర్చు కున్నాను. సైకిల్‌ రిపేరు వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించా. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తుండగా, మరొకరు ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డీఎస్సీ కోచింగ్‌ తీసుకుంటున్నారు. 60, 70 దశకాలలో ర్యాలీ, అంబర్‌ సైకిల్స్‌ ఇప్పటికీ గ్రామంలో రైతులు ఎంతో మక్కువతో భద్రపర్చుకుంటున్నారు. కార్లు, మోటారు సైకిల్స్‌ ఉన్నా సైకిల్‌నే గ్రామంలో అన్ని పనులకు వినియోగిస్తున్నారు. పాత ర్యాలీ, అంబర్‌ సైకిళ్లను ఎక్కువ ఖరీదు పెట్టి కొనుగోలు చే స్తున్నారు.

–పున్నం శ్రీనివాసులు, సైకిల్‌ మెకానిక్‌, కావలిపురం.

పర్యావరణానికి ఇబ్బందిలేని వాహనం..

సైకిల్‌ వినియోగం స్వశక్తితో గమ్య స్థానానికి చేరడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందిలేని వాహనం. సైకిల్‌ తొక్కడం మానవుని గుండె, ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. శరీరంలోని నడుము కింది బాగంలో తొడ, తుంటి భాగం పిక్క కండరాలకు మంచి వ్యాయామం. సైక్లింగ్‌ చేయడం వలన దేహంలోని శక్తి కేలరీలలో ఖర్చుఅవడం వలన శరీరంలోని కొవ్వు నిల్వలు చేరకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. సైకిల్‌ తొక్కడం వలన స్వశక్తిపై నమ్మకం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

–ఎస్వీ సతీష్‌ బాబు, జిమ్‌ ట్రైనర్‌, తణుకు

Updated Date - Jun 03 , 2025 | 12:33 AM