ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జోరుగా.. హుషారుగా

ABN, Publish Date - May 21 , 2025 | 01:17 AM

తెలుగుదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించే దిశగా పార్టీ అధినాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఆచంట మినీ మహానాడులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ తదితరులు

కమిటీల్లో ఉమ్మడి జిల్లా నేతలు.. మంత్రి నిమ్మలతో సహా తొమ్మిది మందికి చోటు

మినీ మహానాడులకు పోటెత్తుతున్న కార్యకర్తలు.. ఆనందంలో ఎమ్మెల్యేలు, కన్వీనర్లు

తెలుగుదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించే దిశగా పార్టీ అధినాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిని విజయవంతం చేసేందుకు వివిధ కమిటీలను ఏర్పాటుచేసింది. వీటిల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్లకు అవకాశం కల్పించారు. మొత్తం 17కు పైగా కమిటీలను వేయగా, వీటిలో ఏడు కమిటీల్లో మన నేతలున్నారు. మరోవైపు నియోజక వర్గాల వారీగా కార్యకర్తల్లో జోష్‌ పెంచేందుకు మినీ మహానాడులను ఇప్పటికే నిర్వహిస్తోంది. వీటికి పెద్ద ఎత్తున హాజరుకావడమే కాకుండా పార్టీ తాజా విజయం ప్రస్తావిస్తూ ఉర్రుతలూగుతున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతిప్రతినిధి):

తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. టీడీపీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది లో జరుగుతున్న మహానాడు కావడంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. మహానాడు విజయవంతానికి 17 కమిటీలను వేయగా, వీటి ఏడింటిలో ఉమ్మడి పశ్చిమ నేతలు, ఎమ్మెల్యేలనే నియమించారు. ఆది నుంచి పార్టీకి కార్యకర్తగా క్రమశిక్షణతో ఎదిగిన జలవ నరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనను ఆహ్వాన కమిటీలోను, సభా ప్రాంగణం, పర్య వేక్షణ కమిటీల్లో చోటు కల్పించారు. భోజ నాల ఏర్పాటు కమిటీలో దెందులూరు, తణు కు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, ఆరి మిల్లి రాధాకృష్ణలకు చోటు కల్పించారు. తీర్మానాల కమిటీలో సీనియర్‌ నేత ఎంఏ షరీఫ్‌ను, ఫొటోప్రదర్శన కమిటీలో మాజీ మంత్రి పీతల సుజాత, రవాణా కమిటీలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు లకు అవకాశం ఇచ్చారు. పత్రిక, మీడియా కమిటీలో సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి, పార్కింగ్‌ కమిటీలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరా జును నియమించారు. ఇంతకుముందు ఈ కమిటీల్లో ప్రత్యేకంగా సీనియర్లకు అవకాశం కల్పించేవారు. ఈసారి సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు సహా పలువురికి చోటివ్వకపోవడం చర్చనీయాంశమైంది.

నియోజకవర్గాల్లో పసుపు జోష్‌

మహానాడు వచ్చిందంటే చాలు టీడీపీ శ్రేణుల్లో పట్టరాని ఆనందం కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున మినీ మహానాడులు జరుగుతు న్నాయి. ఏలూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు, కైకలూరు, భీమవరం, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గాల్లో పూర్తయ్యాయి. అన్నిచోట్ల మహిళలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు. గడిచిన ఐదేళ్ల పాటు తాము ఎదుర్కొన్న కష్టాల స్థానంలో సంతోషం పెరగడానికి పార్టీ గెలుపే కారణ మని అనేకమంది తేల్చి చెబుతున్నారు. కష్ట మైనా, నష్టమైనా పార్టీకి వెన్నంటే ఉంటామని శపథం చేస్తున్నారు. గతంలో నిర్ణీత సమ యంలోనే మినీ మహానాడు నిర్వహించేవారు. కానీ ఈసారి ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తుండగా, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్లు ఉప్పొంగిపోతున్నారు. పార్టీ ఎమ్మె ల్యేలు లేని నియోజక వర్గాల్లోను దీటుగా జరుగుతున్నాయి. ఉంగుటూరు, తాడేపల్లి గూడెం వంటి నియోజకవర్గాల్లో మినీ మహా నాడు సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. మంత్రులు నిమ్మల, పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు, నూజివీ డుల్లో ఇంకా మినీ మహా నాడులు నిర్వహించాలి. నేడు దెందులూరు, నరసాపురాల్లో జరగనున్నాయి.

Updated Date - May 21 , 2025 | 01:17 AM