ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లలేరి..!

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:51 AM

కనీస సంఖ్యలో విద్యార్థులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. వాటిలో చదువుకున్న విద్యార్థుల్లో పలువురు టీసీలు తీసుకుని ప్రైవేటు, ఇతర పాఠశాలల వైపు వెళ్లిపోవడం, కొత్తగా ఒకటో తరగతిలో చేరడానికి కనీస సంఖ్యలో కూడా విద్యార్థులు రాకపోవడంతో వాటి నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఫస్ట్‌ క్లాస్‌లో ఒక్కరూ చేరని ప్రాథమిక పాఠశాలలు 131

అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రైవేటు వైపు మళ్లిన ఎక్కువ మంది

జీరో ఎన్‌రోల్‌మెంట్‌, జీరో స్కూల్స్‌ నిర్వహణ భారమే

ప్రాథమిక తరగతుల్లోనే ఈ సమస్య అధికం

ఏలూరు అర్బన్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):కనీస సంఖ్యలో విద్యార్థులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. వాటిలో చదువుకున్న విద్యార్థుల్లో పలువురు టీసీలు తీసుకుని ప్రైవేటు, ఇతర పాఠశాలల వైపు వెళ్లిపోవడం, కొత్తగా ఒకటో తరగతిలో చేరడానికి కనీస సంఖ్యలో కూడా విద్యార్థులు రాకపోవడంతో వాటి నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీస సంఖ్యలో విద్యార్థులు లేని స్కూళ్లలో చదువుతున్న బాల బాలి కలకు నష్టం వాటిల్లకుండా, వారిని సమీప ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్లేలా చర్యలు తీసు కునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బదిలీపై ప్రాథమిక పాఠశాలలకు వెళ్లిన వందలాది మంది సెకండరీ గ్రేడ్‌ టీచ ర్లను సర్దుబాటు చేయడం విద్యా శాఖకు కష్టతరంగా మారే అవకాశాలు లేకపోలేదు. జూలై 10న నిర్వహించనున్న మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునేలా సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యా శాఖను, ఉపాధ్యాయ వర్గాలను కొద్ది రోజులుగా కలవరపెడుతున్న వరుస పరిణామాలపై పరిశీలన ఇది.

జీరో ఎన్‌రోల్‌మెంట్‌

పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో ఉమ్మడి పశ్చిమలో 2,921 ప్రభుత్వ పాఠశాలలు ఏర్ప డ్డాయి. వీటికి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వ హించే శాటిలైట్‌ (ఎల్‌కేజీ/యూకేజీ లేదా పీపీ–1, 2) పాఠశాలల సంఖ్య అదనం. గత విద్యా సంవత్సరం మార్చి 31వ తేదీ నాటి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రామాణికంగా తీసుకుని ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను నిర్ధారించుకుని ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ టీచర్లను కేటాయించారు. దీనినే ప్రామాణికంగా తీసుకుని పాఠశాలల వారీగా వెకెన్సీలను ప్రకటించి, సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌ ద్వారా కొన్ని వారాల క్రితమే నూతన స్థానాలకు ఉపాధ్యాయులను నియమించారు. తాజా పరిణామాలు గత అంచనాలను తలకిందులు చేయడం గమ నార్హం. ఈ ఏడాది మార్చిలో వున్న ఎన్‌రోల్‌ మెంట్‌ వేసవి సెలవుల అనంతరం పాఠశా లలు పునఃప్రారంభమైన తర్వాత లేకపోవ డంతో పలు ప్రభుత్వ పాఠశాలల మూసివేత దిశగా సన్నాహాలు చేపట్టడానికి కారణంగా తెలుస్తోంది.

జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కేజీ, యూకేజీ)తో పాటు 1,2 తరగతులు బోధించే ఫౌండేషనల్‌ స్కూళ్లు 122, పూర్వ ప్రాథమిక విద్యతోపాటు ప్రాథమిక తరగతులు అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు 928, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు 297, అప్పర్‌ ప్రైమరీ స్కూ ళ్లు 78, అన్ని రకాల హైస్కూళ్లు 241 ఉన్నా యి. వీటిలో ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఏడా ది కొత్తగా ఒకటో తరగతిలోకి ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్‌ తీసుకోని జీరో ఎన్‌రోల్‌ మెం ట్‌ స్కూళ్లు 131 ఉండటం కలవరపెడు తోం ది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఐదు లోపు బాల బాలికలున్న స్కూళ్లు 120, మోడ ల్‌ ప్రైమరీ స్కూళ్లలో నిర్దేశిత 60 మంది విద్యార్థులు లేనివి 137 ఉండటం గమనా ర్హం. మొత్తం ఎంపీఎస్‌ల్లో 15–29 ఎన్‌రోల్‌ మెంట్‌తో మూడు స్కూళ్లు, 30–44 మందితో 49, 45–59 ఎన్‌రోల్‌మెంట్‌తో 97, 60–74 మం దితో 105 స్కూళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఒక టి నుంచి ఐదో తరగతి వరకు ఒక్క విద్యార్థి కూడా లేని జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు 19 ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గణాంకాలన్నీ జూన్‌ 28వ తేదీ నాటివి. మొత్తం మీద కొత్తగా ఒకటో తరగతిలోకి అడ్మిషన్లు, ఐదో తరగతి నుంచి ఆరో తరగతిలోకి ట్రాన్సిషన్‌, మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో సంతృప్తికర సంఖ్యలను ప్రామాణికంగా తీసుకుంటే ఏలూరు జిల్లాలో కలిదిండి, భీమడోలు, నిడమర్రు మండలాలు అగ్రస్థానంలో ఉండగా, బుట్టాయిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండ లాలు అట్టడుగున ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో టాప్‌–3 మండలాల్లో పెనుమంట్ర, పెంట పాడు, వీరవాసరం ఉండగా, పోడూరు, యలమంచిలి, ఆచంట మండలాలు అట్టడుగున ఉన్నాయి.

ఎందుకిలా..

విద్యార్థుల సంఖ్య పరిమితితో నిమిత్తం లేకుండా అర్హులైన వారందరికీ తల్లికి వందనం ఆర్థికసాయం రూ.13 వేలు చొప్పున చెల్లించడం ప్రభుత్వ పాఠశాలలకు గట్టి దెబ్బ కొట్టిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్థిక సాయం అందుకున్న వారిలో పలువురు టీసీలు తీసుకుని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోవడం, నేరుగా ఒకటో తరగతిలో ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్‌ తీసుకోవడమో జరిగింది.

పలు ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్లు పెంచు కునేందుకు వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లను అమలు చేశాయి. తల్లికి వందనం ఆర్థిక సాయం అందుకున్న వారిలో ఇద్దరు పిల్లలుంటే వారిలో ఒకరి నుంచే రూ.15 వేలు ఫీజు వసూలు చేసి, మరొకరికి ఉచితంగా ప్రవేశాలు కల్పించడంతో తల్లితండ్రులు ప్రైవేటు ఆఫర్లవైపు ఆకర్షితులయ్యారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థి ఇంటి నుంచే ఉచితంగా బస్సు సౌకర్యాన్ని పాఠశాలకు రాకపోకలు కల్పించినట్టు చెబుతున్నారు.

ఏలూరు జిల్లాలో ఐదేళ్లలోపు వయస్సువున్న చిన్నారులు గత విద్యా సంవత్సరంలో 13,939 మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్నారు. నిబంధనల ప్రకారం వీరిని సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ టీచర్లదేనని వేసవి సెలవులకు ముందే ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దీనికి భిన్నంగా పాఠశాలలు తెరిచిన తర్వాత అడ్మిషన్లను పరిశీలిస్తే ఈ నెల 16 నాటికి కేవలం 7,331 మంది చిన్నారులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు తీసుకోగా, మిగతా 6,608 మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరారని ఐసీడీఎస్‌ అధికారిక గణాంకాలు నిర్ధారించాయి. దీనికి భిన్నంగా విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జిల్లాలో 11,817 మంది పిల్లలను ఒకటో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాల్సి ఉండగా, ఈ నెల 28 నాటికి కేవలం 6,368 మంది (54 శాతం)మాత్రమే చేరారు. దీంతో ఇపుడు ఒకటో తరగతిలో ఒక్కరూ కొత్తగా అడ్మిషన్‌ తీసుకునే వారు లేరని చెప్పవచ్చు. ఐదో తరగతి ఉత్తీర్ణులై ఆరో తరగతిలోకి చేరాల్సిన (ట్రాన్సిషన్‌) విద్యార్థులు 13,461 మంది ఉండగా, వీరిలో 9,054 మంది (67.3 శాతం) మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. వేసవి సెలవుల్లోనే టీచర్ల సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌ పూర్తి కావాల్సి ఉండగా, పలు కారణాలతో పాఠశాలలు తెరిచిన తర్వాత కొన్ని రోజులపాటు కొనసాగింది. ముఖ్యంగా ప్రాథమిక విద్యను బోదించే ఎస్జీటీలకు బదిలీలు పూర్తయ్యే నాటికి దాదాపు ప్రైవేటు పాఠశాలల వైపు ఒకటో తరగతి విద్యార్థుల అడ్మిషన్లు జరిగిపోయాయని తెలుస్తోంది. ఫలితంగా బదిలీల అనంతరం నూతన స్థానాల్లో చేరిన టీచర్లు ఆవాస ప్రాంతాల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

Updated Date - Jul 01 , 2025 | 01:51 AM