వేలేరుపాడులో ఏం జరుగుతోంది?
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:10 AM
విస్తృతమైన సాయుధ బలగాల గాలింపులతో వేలేరుపాడులో ఏం జరుగుతోంది ? అనే ప్రశ్న స్థానికులను ఆందోళన కలిగిస్తోంది.
వేలేరుపాడు, జూన్ 7(ఆంధ్రజ్యోతి): విస్తృతమైన సాయుధ బలగాల గాలింపులతో వేలేరుపాడులో ఏం జరుగుతోంది ? అనే ప్రశ్న స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు ఆపరేషన్ కగార్‌తో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో హత మవడంతో మిగిలిన వారు ఇటువైపు వస్తున్నారన్న అనుమా నాలు లేకపోలేదు. చాలా ఏళ్ల తర్వాత మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు పోలీస్ శాఖకు నిఘా వర్గాల ద్వారా తెలియడంతో మండలంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆపరేషన్ కగార్‌తో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా వేలేరుపాడు మండ లాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. గతంలో ఒడిశా, ఛత్తీస్‌గడ్, రాష్ర్టాల్లో ఎన్‌కౌంటర్‌లు, కూంబింగ్‌లు జరి గిన సందర్భాల్లో మావోయిస్టులు ఈ మండలంలోని కోయిదా, కటుకూరు అటవీ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో పెద్దఎత్తున వారి ఆచూకీ కోసం భారీ ఎత్తున గ్రేహౌండ్స్ దళాలతో కూంబింగ్‌లు నిర్వహించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
మేడేపల్లి, రామవరం పంచాయతీల్లో వాటర్ ట్యాం కుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు శనివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటన ఖరా రైంది. అయితే శంకుస్థాపన చేసే గ్రామాలు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో భద్రతా చర్యల్లో భాగంగా చివరి నిమిషంలో పోలీసు అధికారుల సూచనలతో పర్యటన రద్దు చేసుకున్నారు. అభివృద్ధి పనులకు కూటమి నాయకులు భూమి పూజ చేసి ముగించారు.
Updated Date - Jun 08 , 2025 | 01:10 AM