ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిశ్రమిద్దాం

ABN, Publish Date - May 13 , 2025 | 12:41 AM

కొత్త పరిశ్రమల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.

లిఖితపూడిలో పారిశ్రామిక పార్కుకు శంకుస్థాపన చేస్తున్న ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు, ఎమ్మెల్యే నాయకర్‌ తదితరులు

ఆటో మొబైల్‌, ఇతర తయారీ రంగాల ప్రాజెక్ట్‌లే లక్ష్యం

మిగిలిన ఐదుచోట్ల భూమి లభ్యతతోనే కదలిక..

ఆ దిశగా దృష్టి సారించిన ప్రభుత్వం

కొత్త పరిశ్రమల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపా యాలైన నీటి సరఫరా, విద్యుత్‌ వంటి అవసరాలు మెరుగు పడతాయి. పరిశ్రమల చుట్టూ చిన్నపాటి వ్యాపారాలైన హోటల్స్‌, ట్రాన్స్‌పోర్టు, హౌసింగ్‌ వంటి రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి రావడంతో సరుకుల ధరలు కొంత వరకు స్థిరంగా వుంటాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో పార్క్‌లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంది. నరసాపురం రూరల్‌ మండలం లిఖితపూడిలో రూ.13.20 కోట్లతో పారిశ్రామిక పార్క్‌కు సోమవారం శంకుస్థాపన చేశారు. ఉండి నియోజకవర్గం విస్సాకోడేరులో మరోపార్క్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. అక్కడ 9.7 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు రూ.10.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. త్వరలోనే అక్కడ పనులు ప్రారంభిస్తారు. భూములు అనువుగా ఉన్నచోట తొలుత పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమొబైల్‌ రంగంలో యూనిట్ల తయారీ, ఆక్వా సహా వివిధ రంగాల్లో యంత్ర పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీటిని నెలకొల్పుతున్నారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. వాణిజ్యం విస్తరిస్తుంది. పరిశ్రమల నుంచి పరికరాలను రప్పించి ఇక్కడే అవసరమైన యూనిట్‌లను తయారుచేస్తారు. అమ్మకాలు సాగిస్తారు. అందుకు తగిన విధంగా మెషినరీల తయారీకి ఇండస్ర్టియల్‌ పార్క్‌లు కీలక భూమిక వహించనున్నాయి.

పలుచోట్ల భూముల సమస్య

జిల్లాలో భూమి లభ్యతను బట్టి రెండుచోట్ల పార్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇతర నియోజకవర్గాల్లో ప్రధానంగా భూసమస్య వెంటాడుతోంది. భీమవరంలో భూములు కొనుగోలు చేయాలన్నా ధరలు అధికంగా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ భూములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇతర ప్రాజెక్ట్‌లకు ప్రతిపాదించారు. ఏపీ నిట్‌కు 25 ఎకరాల భూమి అవసరం కానుందని ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి మరో 40 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి ఏపీ నిట్‌ నివేదిక ఇచ్చింది. అయితే 25 ఎకరాలు ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయి. అయినా కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటుకు తాడేపల్లిగూడెంలోనూ భూమి సమస్య కనిపిస్తోంది. వాస్తవానికి పారిశ్రామిక పట్టణంగా తణుకు ఇప్పటికే జిల్లాలో గుర్తింపు పొందింది. అక్కడ భూములు సేకరించాలంటే పెద్దమొత్తంలో నిధులు వెచ్చించాలి. ప్రభుత్వభూమి అందుబాటులో లేదు. జిల్లా ఆసుపత్రికి తణుకులో భూమిని కేటాయించలేకపోతున్నారు. కొత్తగా పారిశ్రామిక పార్కుకు భూమిని సేకరించాలి. ముందుగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం పారిశ్రామిక పార్క్‌లు ప్రథమంగా నెలకొల్పుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరితే యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి.

యువతకు ఉపాధి కల్పిస్తాం

రూ.13.15 కోట్లతో ఇండస్ర్టియల్‌ పార్కుకు శంకుస్థాపన

నరసాపురం రూరల్‌, మే 12(ఆంధ్రజ్యోతి):నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇండస్ర్టియల్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు తెలిపారు. సోమవారం లిఖితపూడిలో రూ.13.15 కోట్లతో నిర్మించే ఇండిస్ర్టియల్‌ పార్కు పనులకు ప్రభుత్వ విఫ్‌, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. రామరాజు మాట్లాడుతూ యువతలో స్కిల్‌ నైపు ణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 16 పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విప్‌ నాయకర్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లు రాష్ర్టాభివృద్ధే ధేయ్యంగా పని చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడు తూ నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువత స్కిల్స్‌ను పెంచుకోవా లన్నారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ రామరాజు మాట్లాడుతూ ఇలాంటి పార్కుల వల్ల పరిశ్రమల ఏర్పాటుతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతా యన్నారు. జోనల్‌ మేనేజర్‌ బాబ్జీ, ఆర్డీవో దాసి రాజు, పోలిశెట్టి శ్రీనివాస్‌, సర్పంచ్‌లు ఈదా సురేష్‌, పెద్దిరాజు కొల్లు పెద్దిరాజు, జక్కం శ్రీమన్నారాయణ, వాతాడి ఉమా, వలవల నాని, బందెల రవీంద్ర, సోడదాసి శ్రీధర్‌, మెరుగుమువ్వుల రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంకు ఇదేనా ప్రాధాన్యత ?

ఇండస్ట్రియల్‌ పార్క్‌ శంకుస్థాపనలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్‌లో మంత్రుల ఫొటోలు సైజులోనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోను ముద్రించడంపై జనసేన పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరావు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఫొటో పెద్దగా వేసి, డిప్యూటీ సీఎం ఫొటో చిన్నదిగా చూపించడం ఎంత వరకు సమంజసం అంటూ నిలదీశారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే సహించేది లేదని మండిపడ్డారు.

Updated Date - May 13 , 2025 | 12:41 AM