తీరు మారకపోతే ఏసీబీతో పట్టించేస్తా
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:52 AM
‘‘ భీమవరం మునిసిపాల్టీ అవినీతి మయంగా మారింది.. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి..
భీమవరం టౌన్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ భీమవరం మునిసిపాల్టీ అవినీతి మయంగా మారింది.. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.. అధికారులు విధానం మార్చు కోవాలి... లేదంటే నేనే నిర్ధాక్షిణ్యంగా ఏసీబీకి పట్టిం చేస్తా..’’ అంటూ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (ఆంజిబాబు) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టికపోతే భీమవరంలో ఎవరూ ఇళ్లు కట్టుకోలేరన్నారు. మంగళవారం మునిసిపాల్టీలో అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారులు పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో కష్టాలు పడతాడని ఒక బిల్డింగ్‌పై ఒక రూమ్ వేసుకుంటే రూ.25 వేలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి పన్ను వసూళ్లపై ఆయన అధికారులను ప్రశ్నించారు. 21 కోట్లు డిమాండ్ ఉండగా 10.96 వసూలవడంపై ప్రశ్నించారు. పట్టణంలో కుళాయి కనెక్షన్‌లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగారు. టౌన్ రైల్వేస్టేషన్ వెనుక దరఖాస్తులు చేసుకున్నా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని ఎంఈ త్రినాథరావు సమాధానమిచ్చారు. వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదని ఫిర్యాదుల వస్తు న్నాయని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి పిర్యాదులు వస్తే 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సి పల్ కమిషనర్‌కు సూచించారు. సమావేశంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ చంద్రారెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:52 AM