ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీలకు రీ కౌన్సెలింగ్‌ చేపట్టండి

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:39 AM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేదని, రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

వినతులు ఇచ్చేందుకు వచ్చిన ఉద్యోగులు

ఏలూరు రూరల్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేదని, రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బదిలీ తీరుపై సంక్షేమ, విద్యా సహాయకులు ఆందోళన చేపట్టడంతో అభ్యంతరాలు పరిశీలించా లని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశిం చారు. జడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి మంగళవారం వినతులు స్వీకరించారు. తాము ఇచ్చి న ఆప్షన్‌ కాకుండా సుదీర్ఘ ప్రాంతాలు, ఇతర మండలాల్లో పోస్టింగ్‌ ఇవ్వడం, ఒకేచోట ఇద్దరికి పోస్టింగ్‌ ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం కోరుతున్న స్థానాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెబుతున్నారని, తాము కోరిన స్థానాల్లో ఇప్పటికే చాలా మంది విధుల్లో చేరారన్నారు. 646 మందిలో 606 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారని, మిగిలిన 40 పోస్టులకు మాత్రమే విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారని మండిపడుతున్నారు. రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతుంటే మభ్యపట్టేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 5 ప్రకారం సీనియారిటీ జాబితా, ఖాళీలను వెల్లడించి, ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, ప్రాధాన్య కేటగిరి, విజ్ఞప్తుల జాబితా వంటి వివరాలను ముం దస్తు ప్రకటించాల్సి ఉందన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:39 AM