ఎక్కడి వారు.. అక్కడే!
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:49 AM
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గ్రేడ్–1 వీఆర్వోలకు ఝలక్ తగిలింది. సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్–2 వీఆర్వోలకు మాత్రమే ప్రస్తుతం బదిలీలు నిర్వహిస్తున్నారు,
సచివాలయ బదిలీల్లో గ్రేడ్ 1 వీఆర్వోలకు ఝలక్
సీనియర్లకు మొండిచేయి
పంచాయతీ రాజ్‌లో గ్రేడ్–2 వీఆర్వోలు
రెవెన్యూ శాఖ పరిధిలో గ్రేడ్–1 వీఆర్వోలు
గ్రేడ్–2 సిబ్బందికి మాత్రమే బదిలీ
గ్రేడ్–1 వీఆర్వోలకు విధుల్లో సైతం ఇబ్బందులు
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గ్రేడ్–1 వీఆర్వోలకు ఝలక్ తగిలింది. సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్–2 వీఆర్వోలకు మాత్రమే ప్రస్తుతం బదిలీలు నిర్వహిస్తున్నారు, క్లస్టర్ హేతుబద్ధీకరణలో వారికే ప్రాధాన్యం ఇచ్చారు. గ్రేడ్–1 సిబ్బందిని మిగులు సిబ్బందిగా చూపి బదిలీలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తే అక్కడే కొనసాగేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదే ఇప్పుడు వీఆర్వోలను ఆందోళనకు గురి చేస్తోంది. సచివాలయాల్లో నియమితులైన వీఆర్వోలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి వారికే బదిలీలు నిర్వహిస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సచివాలయాల్లో నియమితులైన రెవెన్యూ సిబ్బంది గ్రేడ్–2 వీఆర్వోలుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం బదిలీల్లో ప్రభుత్వం వారికే ప్రాధాన్యం ఇస్తోంది. మిగులు సిబ్బందిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై గతంలోనే రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి అనేక పర్యాయాలు వినతిపత్రం సమర్పించింది. రెవెన్యూ ఉద్యోగు ల బదిలీలు, మిగులు ఉద్యోగులపై సరైన నిర్ణయం తీసుకో వాలని కోరింది. ప్రభుత్వం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత బదిలీల్లో గ్రేడ్–2 వీఆర్వో లకు మాత్రమే బదిలీ నిర్వహిస్తున్నారు.
జిల్లాలో గ్రేడ్–1 వీఆర్వోలు 350 మంది ఉన్నారు. భవిష్య త్‌లో వారికి ఎటువంటి విధులు అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. కలెక్టరేట్ లేదా ఇతర శాఖలకు బదిలీ చేస్తారన్న అనుమానం వారిని వెంటాడుతోంది. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–2 రెవెన్యూ ఉద్యోగులు ప్రస్తుతం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆమోదంతోనే వేతనాలు మంజూరవుతున్నాయి. గ్రేడ్–1 వీఆర్‌వోలు మాత్రమే రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నారు.
విధుల్లో సైతం ఇబ్బందులు..
సచివాలయంలో పాలనాపరమైన విధానంతో రెవెన్యూ శాఖ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వేతనాలు, సెలవుల కోసం సచివాలయాల్లో గ్రేడ్–2 వీఆర్వోలు ఎంపీడీవోల వద్ద కు వెళుతున్నారు. విధుల విషయంలో తహసీల్దార్‌లు సచి వాలయాల్లో వీఆర్వోలకు ఆదేశాలిస్తున్నారు. ఇలాంటి విధానంతో పాలనాపరమైన ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల నీటి తీరువా వసూళ్లలో జాప్యం జరిగింది. డిమాం డ్ నోటీసులు ఇచ్చేంతవరకే రెవెన్యూ శాఖ పరిమితమైంది. రైతులు నేరుగా సచివాలయాలకు వెళ్లి నీటి తీరువా చెల్లి స్తున్నారు. గతంలో వీఆర్వోల ద్వారా వసూలు చేసిన పన్ను సక్రమంగా ప్రభుత్వ ఖాతాకు జమ కాలేదు. సచివాల యాల్లో అయితే పారదర్శకత ఉంటోంది. రైతులు మాత్రం సచివాలయాలకు వెళ్లి చెల్లించడం లేదు. దీనిపై వీఆర్వోల స్థాయిలో పర్యవేక్షణ ఉండడం లేదు. దాంతో నీటి తీరువా, ఇతర రెవెన్యూ వసూళ్లు కూడా సక్రమంగా చేయలేకపో తున్నారు. మరోవైపు తాజా బదిలీల్లోనూ గ్రేడ్–1 వీఆర్వోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వార్డు సచివాలయ ఉద్యోగులకు మునిసిపాలిటీ పరిధిలోనే బదిలీ
వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో మునిసిపాలి టీ యూనిట్‌గా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వార్డు సచివాలయ సిబ్బందిని జిల్లా యూనిట్‌గా తీసుకోవాలా..? మునిసిపాలిటీల్లో ఇతర వార్డులకు బదిలీ చేయాలా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. జిల్లా పరిధిలో ఇతర మునిసిపాలిటీలకు బదిలీ చేస్తా రని భావించారు. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాను యూనిట్‌గా తీసుకుని బదిలీలు నిర్వహిస్తే ఎవరికి ఎక్కడ పోస్టింగ్ వస్తుందోనని ఉత్కంఠగా ఉన్నారు. చూశారు. మునిసిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసిన సిబ్బందిని గుర్తించారు. వారంతా ఇతర మునిసిపాలిటీలకు బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. రెండేళ్లు పూర్తి చేసిన వారుకు అభ్యర్థనకు ముందుకు వచ్చారు. దీనితో కొన్ని మునిసిపాలిటీల్లో దాదాపు 80శాతం మంది బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. మున్ముందు పాలనపై ప్రభావం చూపుతుం దని మునిసిపల్ కమిషనర్లు భావించి ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుత వార్డు తప్ప ఇతర వార్డులకు బదిలీ అయ్యేలా చూడాలని కోరారు. మునిసిపల్ కమి షనర్ల అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. మునిసిపాలిటీ పరిధిలో ఇతర వార్డు సచివాలయా లకు బదిలీ చేసే వెసులుబాటు ఇచ్చింది. ఉద్యోగులను ఇతర మునిసిపాలిటీలకు బదిలీ చేయాలంటే జిల్లా కలెక్టర్లకు అధికారం కల్పించారు. భీమవరం, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పురపాలక సంఘంతోపాటు, ఆకివీడు నగర పంచాయతీల పరిధి లో బదిలీలకు అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు వార్డులకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఏ వార్డులో ఏ పోస్టింగ్ ఉండాలో నిర్ధారించారు. ఈ నెల 30నాటికి బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది.
Updated Date - Jun 25 , 2025 | 12:49 AM