కార్లు, ద్విచక్ర వాహనాల తనిఖీ
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:07 AM
జిల్లాలో కార్లు, ద్విచక్ర వాహన దారులను అధికారులు మంగళవారం తనిఖీ చేశారు.
భీమవరం క్రైం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్లు, ద్విచక్ర వాహన దారులను అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో పలు చోట్ల పది మంది వాహన తనిఖీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాహనదా రులకు రూ.2,46,800 అపరాధ రుసుం విధించారు. హెల్మెట్లు ధరించని వారిపై 32, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారిపై 30, సీటు బెల్టు లేనివారిపై 28, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై 8, నెంబర్ ప్లేటు లేనివారిపై 2, ఇన్సూరెన్స్ లేనివారిపై 3, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై 11 కేసులు నమోదు చేశారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకున్నా, రాంగ్ రూట్‌లో వెళ్లినా 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తా మని అధికారులు హెచ్చరించారు. వాహనచోదకులు హెల్మెట్, సీటు బెల్ట్, విధిగా ధరించాలని రవాణా అధికారి ఉమామహేశ్వరరావు సూచించారు.
Updated Date - Jun 19 , 2025 | 12:07 AM