తెల్లారిన కూలి బతుకులు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:11 AM
రెక్కాడితేకాని డొక్కాడని వారికి కూలి పనులే ఆధారం. ఉన్న ఊరిలోనే ఏదొక పని చేసుకుని బతుకు వెళ్లదీస్తారు. ఎప్పటిలాగే ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్లిన వారి బతుకులే తెల్లారి పోయాయి.
ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన వ్యాన్
ఇద్దరు మహిళల దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మొగల్తూరులో విషాదం
పోలీస్, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు
సంఘటనా స్థలిని పరిశీలించిన కలెక్టర్, డీఎస్పీ, ఎమ్మెల్యే
మొగల్తూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రెక్కాడితేకాని డొక్కాడని వారికి కూలి పనులే ఆధారం. ఉన్న ఊరిలోనే ఏదొక పని చేసుకుని బతుకు వెళ్లదీస్తారు. ఎప్పటిలాగే ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్లిన వారి బతుకులే తెల్లారి పోయాయి. పనులు చేస్తుండగా వ్యాన్ రూపం లో మృత్యువు కబళించింది. ఏమి జరిగిందో తెలిసేలోపు ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయా యి. మరో ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
మొగల్తూరు పంచాయతీ పరిధి నల్లంవారి తోట దొడ్డితిప్ప ప్రాంతంలో బుధవారం ఉదయ మే జరిగిన సంఘటనతో విషాదం అలుము కుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మొగల్తూరు పంచాయతీ పరిధి నక్కావారిపాలెంకు చెందిన 15 మంది కూలీలకు ఉపాధి పనుల్లో భాగంగా నల్లం వారితోటలో సుమారు కిలోమీటరు పొడవు గల 46 డీపీ చానల్ పంట బోదె తవ్వకం పని అప్పగించారు. 216 జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట బోదెలో కూలీలు పనులు చేస్తుం డగా పల్నాడు జిల్లా నరసారావుపేట నుంచి మొగల్తూరుకు వంటనూనె లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న సైకిల్, ఉపాధి కూలీల మీదుగా పంటబోదెలోకి దూసు కుపోయింది. బోదెలో పని చేస్తున్న కడలి పావ ని (40), గుబ్బల గంగాదేవి (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కూలీలు గుడాల వీర వెంకట సత్యనారాయణ, మృతురాలు గుబ్బ ల గంగాదేవి భర్త మాణిక్యాలరావుకు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడం తో సమీపంలో కూలీలంతా ప్రమాదం జరిగిన పంటబోదె వద్దకు పరుగులు తీశారు. గాయపడ్డ మహిళలను బోదెలోంచి బయటకు తీసుకువ చ్చారు. వారిద్దరూ అప్పటికే విగతజీవులయ్యారు. మరో ఇద్దరు గాయాలతో ఆర్తనాదాలు చేస్తుండ డంతో వెంటనే పోలీస్, 108కు సమాచారం అందించారు. గాయపడిన ఇద్దరిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అధికారుల సహాయక చర్యలు
బోదెలో పడ్డ వ్యాన్ కింద మరికొంత మంది కార్మికులు ఉండవచ్చన్న అనుమానంతో పోలీసు లు హైడ్రాలిక్ యంత్రాన్ని రప్పించి వ్యాన్‌ను బయటకు తీశారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ నాగరాణి, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, ట్రైనీ డీఎస్పీ మానస, రూరల్ సీఐ దుర్గా ప్రసాద్, ఎస్‌ఐలు జి.వాసు, నాగలక్ష్మి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, తహసీల్దార్ కె.రాజ్ కిశోర్, ఎంపీడీవో సీహెచ్ త్రిశూలపాణి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. వంట నూనె ప్యాకెట్‌లు, నూనె డబ్బాల లోడును పోలీస్ సిబ్బంది స్వయంగా ఖాళీ చేయడంతో హైడ్రాలిక్ యంత్రంతో వ్యాన్ గట్టుకు రప్పించారు. మొగల్తూరు పరిసర ప్రాం త ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనా ప్రదేశానికి తరలివచ్చారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్ధంబించిపోయింది.
శుభకార్యానికి వెళ్లి..
ఉదయాన్నే పనికి వెళ్లడానికి తెల్లవారు జామునే లేచి ఇంటి పనులు ముగించుకున్నారు. గంగాదేవి, భర్త మాణిక్యాలరావు పనికి వెళుతూ గ్రామంలో ఒక శుభకార్యక్రమానికి వెళ్లి అక్షింత లు వేశారు. దంపతులు ఇద్దరూ కలిసి ఆశీర్వదిం చిన చివరి ఘట్టం అదే. కడలి పావని అదే శుభకార్యానికి వెళ్లి అక్కడి నుంచి పనికి వెళ్లిన అరగంటలోనే మృ త్యువాత పడింది.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
కలెక్టర్ నాగరాణి, విప్ నాయకర్
ప్రమాదస్థలిని కలెక్టర్ నాగరాణి, ప్రభుత్వ విప్ నాయకర్ పరిశీలించారు. నరసాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకున్నారు. గుబ్బల మాణిక్యాలరావును మె రుగైన వైద్యం కోసం భీమవరం ప్రైవేట్ ఆసు పత్రికి తరలించారు. తలకు గాయాలైన గుడాల సత్యనారాయణకు స్కానింగ్ తీయించి నరసా పురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయిస్తు న్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం ది. కలెక్టర్, విప్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హమీ ఇచ్చారు. ఇద్దరు మహిళా కూలీల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున గాయపడ్డ కూలీలకు ఒక్కొక్కరికి రూ.25వేలు చొప్పున నష్టపరిహారం అందజేస్తామని డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తెలిపారు. చంద్రన్న బీమా పథకం నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు చొప్పున నష్టపరిహరం అందించే అవకాశం ఉందని ఆయన వివరిం చారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Apr 17 , 2025 | 12:11 AM