ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు మోగల్లులో ‘అల్లూరి’ ధ్యాన మందిరం ప్రారంభం

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:16 AM

అల్లూరి సీతారామరాజు నడయాడిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం మరోసారి కీర్తి ప్రతిష్ఠలు చాటేందుకు సిద్ధమైంది.

మోగల్లులో సిద్ధమైన అల్లూరి సీతారామరాజు ధ్యాన మందిరం

వర్చువల్‌గా ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

పాలకోడేరు, జూలై 2(ఆంధ్రజ్యోతి) : అల్లూరి సీతారామరాజు నడయాడిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం మరోసారి కీర్తి ప్రతిష్ఠలు చాటేందుకు సిద్ధమైంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పురిటిగడ్డ మోగల్లులో ఆయన జ్ఞాపకాలను పదిలపరిచే విధంగా అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం ట్రస్ట్‌ సభ్యుల ఆధ్వర్యంలో ధ్యాన మందిర ప్రారంభోత్సవాన్ని ఒక వేడుకగా చేసేందుకు సిద్ధమయ్యారు. మోగల్లులో 2013లోనే పూర్ణానంద స్వామి సమక్షంలో ఆయన నడయాడిన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం అప్పటి ట్రస్ట్‌ చైౖర్మన్‌ దివంగత పెన్మెత్స శ్రీరామరాజు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మందిర నిర్మాణం ఆలస్యమైంది. గ్రామంలోని క్షత్రియ యువజన సంఘాల ఆధ్వర్యంలోనే జయంతి, వర్ధంతి సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. మోగల్లు గ్రామాన్ని ఆథ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే పార్టీలకతీతంగా నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవా సమితి నాయకులు, ట్రస్ట్‌ సభ్యులు అల్లూరి నడయాడిన ప్రాంతంలో ధ్యాన మందిరాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టి సుమారు 2022 నుంచి భవన నిర్మాణ పనులు తలపెట్టారు. ఆ భవన నిర్మాణంలో భాగంగా నాలుగు సెంట్ల స్థలాన్ని రాజమహేంద్రవరానికి చెందిన డీఎస్‌ఆర్‌ బాబు.. అల్లూరి సీతారామరాజు ట్రస్ట్‌కు అందించగా, ధ్యాన మందిరాన్ని నిర్మించేందుకు వీవీఆర్‌ వర్మ (వెర్టెక్స్‌ వర్మ) సహాయ సహకారాలతో రూ. 55లక్షలతో ఆ భవనాన్ని ట్రస్ట్‌ సభ్యులు నిర్మించారు.

ధ్యాన మందిరంలో మరిన్ని సేవలు

క్షత్రియ కార్పొరేషన్‌ ద్వారా గ్రామంలో నిర్మించిన ధ్యాన మందిరంలో అల్లూరి సీతారామరాజు పేరును రాబోయే తరానికి తెలిసే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న స్థలాన్ని అందించిన రాజమహేంద్రవరానికి చెందిన డీఎస్‌ఆర్‌ బాబు, భవన నిర్మాణానికి చేయూతనందించిన వెర్టెక్స్‌ వర్మతోపాటు ఆ గ్రామంలోని మరికొంత మందికి, క్షత్రియ సేవా సమితి సభ్యులను ఘనంగా సత్కరిస్తామని సేవా సమితి రాష్ట్ర ఛైర్మన్‌ డి.శ్రీనివాసరాజు తెలిపారు.

వర్చువల్‌గా ధ్యాన మందిరం ప్రారంభం

అల్లూరి సీతారామరాజు 128వ జయంతి పురస్కరించుకుని మోగల్లు గ్రామంలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజున చుట్టుపక్కల గ్రామాల క్షత్రియ యువజన సంఘాలు, మోగల్లు గ్రామస్థులు, పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామంలో పండుగ వాతావరణంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:16 AM