నేడు ప్రైవేటు పాఠశాలలు బంద్..
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:36 AM
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గురువారం బంద్ ప్రకటించాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గురువారం బంద్ ప్రకటించాయి. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు కేటాయిస్తోంది. ఫీజు నిర్ధారణ చేయలేదంటూ యాజమాన్యాలు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో సీట్లు కేటాయించేవారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రూ.18 వేలు చెల్లించేది. వైసీపీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ సీట్లను రద్దు చేశారు ఉచిత సీట్ల విధానాన్ని పక్కన పెట్టేశారు. చివరి రెండు సంవత్సరాల్లో మళ్లీ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత సీట్లు కేటాయించారు. అమ్మఒడి పథకం సొమ్ము నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలకు ఫీజులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథాతథంగా ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని ఆశించారు. జిల్లాలో తొలి విడతగా 912 సీట్లు కేటాయించారు. యాజమాన్యాలు చేర్చుకోవడానికి వ్యతిరేకించాయి. మలి విడతో మరో 345 సీట్లు కేటాయించారు.అయితే ప్రభుత్వం ఫీజును నిర్ధారిం చాలంటూ యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. తల్లికి వందనం సొమ్ములనే మళ్లీ వసూలు చేసుకునే విధానం వస్తుందంటూ ప్రైవేటు యాజ మాన్యాలకు సంకేతాలు అందాయి. దాంతో తమ పాఠశాలల్లో ఉచిత సీట్లకు ఫీజు రాదని యాజమాన్యాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గురువారం బంద్‌కు నిర్ణయించాయి. జిల్లాలో 439 ప్రైవేటు పాఠశాలలున్నాయి. గురువారం అవి మూతపడనున్నాయి.
Updated Date - Jul 03 , 2025 | 08:49 AM