ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి అడుగు

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:16 AM

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు చేరువైంది.

పాలకొల్లులో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు

నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం శ్రేణులు

పార్టీ నాయకులు, కార్యకర్తలు నెల రోజులు ప్రజల్లోనే

కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ

సమస్యలపైనా ఆరా

మై టీడీపీ యాప్‌లో నమోదు

పరిష్కారం దిశగా ప్రభుత్వం

జిల్లాలో పార్టీ శ్రేణులు సన్నద్ధం

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు చేరువైంది. సూపర్‌ సిక్స్‌ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. రాజకీయ కక్షలు, వేధింపులు, కేసులు లేకుండా సుపరిపాలనతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఏ కేసు పెడతారో.. ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారో అనే భయం అందరినీ వెంటాడింది. ఇప్పుడు అంతా పారదర్శకం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తెలుగుదేశం పార్టీ ఇంటింటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈనెల 2 నుంచి ప్రజలతో మమేకం అవు తారు. ఇంటింటికి వెళ్లిన కేడర్‌ వారితో ఫోటో తీసుకుని ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయా లను సేకరిస్తారు. అభిప్రాయాలు, సమస్యలు మై టీడీపీ యాప్‌లో నమోదు చేస్తారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో సమస్యలను అడిగి తెలుసుకుం టారు. ఏ సమస్యపై ప్రజలు స్పందిస్తారో వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. తదనుగుణంగా ప్రభుత్వం ఆయా సమస్యలు పరిష్కారం చేయనుంది. ఇప్పటికే ముఖ్య మంత్రి చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు ఇంటింటా తెలుగుదేశం, సుపరిపా లన, తొలి అడుగుపై కర్తవ్యభోధ చేశారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి గడపను తాకాలని హిత బోధ చేశారు. సుపరిపాలనపై ప్రజల అభిమతాన్ని ప్రభు త్వం తెలుసుకోనుంది. ప్రభుత్వ పనితీరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజ ల్లోకి తీసుకువెళ్లనున్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం పాలన తీరు, అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిపై ప్రజలను చైతన్య పరచనున్నారు. విపక్షాలపై విమర్శల కంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేయాలంటూ ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు హితబోధ చేశారు.

జిల్లాలో సన్నద్ధం

జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుపరిపా లనపై తొలి అడుగు కార్యక్రమాన్ని నేతలు సన్నద్ధమయ్యారు. క్లస్టర్‌, బూత్‌, యూనిట్‌ ఇన్‌చార్జ్‌లు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్ర మంలో కీలకంగా వ్యవహరించనున్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందరికీ వివరించనున్నారు. ప్రతి నియోకవర్గంలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు మంగళవారం సన్నాహక సమావేశాలను నిర్వహించారు. కస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లు తమ మొబ్‌ల్‌ ఫోన్‌లో ప్రభుత్వం రూపొందించిన యాప్‌ను అప్‌లోడ్‌ చేసుకు న్నారు. ఒక్కో బూత్‌ ఇన్‌చార్జ్‌ ప్రతిరోజు 50 ఇళ్లకు వెళ్లి వారితో పోటో తీసుకుని సమ స్యలను అడిగి తెలుసుకుంటారు. వాటిని యాప్‌లో వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. మండల, పట్టణ, గ్రామ కమిటీలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని అధిష్ఠానంతోపాటు, నియోకవర్గ భాధ్యులు దిశానిర్దేశం చేశారు. మై టీడీపీ యాప్‌ను అప్‌లోడ్‌ చేసుకుని నెలరోజులపాటు ప్రజలతో మమేకం అయ్యేలా సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఏడాది పాలన ఎలా ఉంది..

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉందనే దానిపై ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల మనోగతాన్ని తెలుసుకుంటారు. బాగుంది, బాగోలేదు, ఫర్వాలేదు అనే మూడు ఆప్షన్‌లు ఉంటాయి. ప్రతి ఇంటిలో అభిప్రాయాలను మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇంటికి వెళ్లినప్పుడు పెన్షన్‌, తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, రేషన్‌ కార్డు, మత్స్యకారుల సేవలు, చేనేతలకు ఉచిత విద్యుత్‌, టిడ్కో ఉచిత ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలపై సమస్యలు చెబితే వారి వివరాలను నమోదు చేస్తారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. సమస్యలపైనా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సరైన సమాధానం చెపాల్సి ఉంటుంది. ప్రజల్లోకి ప్రభుత్వ పాలన తీసుకువెళ్లడానికి సుపరిపాల నపై తొలి అడుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని భీమవరం, ఉం డి, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, పాల కొల్లు, నరసాపురం నియోకవర్గాల్లో కేడర్‌ సర్వసన్నద్ధమైంది. నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు విస్తృతస్థాయి సమావేశాలను ఏర్పాటుచేసి కార్యకర్తలను సమాయత్తపరిచారు.

Updated Date - Jul 02 , 2025 | 12:16 AM