అట్టహాసంగా సాహితీ సంబరాలు ప్రారంభం
ABN, Publish Date - May 11 , 2025 | 12:31 AM
ఏలూరు నగరంలో అట్టహాసంగా ప్రపంచ సాహితీ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరు మహాలక్ష్మీ గోపాలస్వామి కల్యాణ మండపం ఆవరణలో సంస్థ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో రెండు రోజులపాటు ఈ సంబరాలు జరగనున్నాయి.
ఏలూరు రూరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఏలూరు నగరంలో అట్టహాసంగా ప్రపంచ సాహితీ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరు మహాలక్ష్మీ గోపాలస్వామి కల్యాణ మండపం ఆవరణలో సంస్థ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో రెండు రోజులపాటు ఈ సంబరాలు జరగనున్నాయి. గిరిజన సంప్రదాయ నృత్యాలు, కొమ్ము డ్యాన్స్‌లతో సంబరాలు నిర్వహించారు. తొలిరోజు వెయ్యి మంది కవులు, కళాకారులు హాజరయ్యారు. కవుల కవితా గానం, భరత నాట్యం, కూచిపూడి, పుస్తకావిష్కరణ, నాటికలు తదితర కార్యక్రమాలు జరిగాయి. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు బాషను, తెలుగు సంస్కృతిని ఖండాంతరాలు వ్యాపింపచేయాలనే ఉద్దేశ్యంతో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు కత్తిమండ ప్రతాప్ తెలిపారు. ముఖ్య అతిథిగా మాస్ట్రో గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ టి.పార్థసారథి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, అధ్యక్షురాలు జి.ఈశ్వరిభూషణం, చిట్టే లలిత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృదేవోభవ పురస్కారాలను ఉభయ రాష్ట్రాల్లో 50 మందికి, పలువురు సాహితీవేత్తలు, కవులకు అక్షర తేజం కవిరత్న పురస్కారాలను అందజేశారు. తెలుగుభాషా సేవామూర్తులను సత్కరించారు.
Updated Date - May 11 , 2025 | 12:31 AM