హెచ్‌ఎం, ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు
ABN, Publish Date - May 17 , 2025 | 12:34 AM
పదో తరగతి పరీక్షలు ఫెయి లైన విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధులుగా చేసేందుకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వ హిస్తున్న రెమిడియల్ క్లాసులకు విద్యా ్థులు హాజరయ్యేలా శ్రద్ధ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై జిల్లా విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
‘పది’ రెమిడియల్ క్లాసులకు విద్యార్థుల గైర్హాజరు ఫలితం
ఏలూరు అర్బన్, మే 16 (ఆంధ్ర జ్యోతి) : పదో తరగతి పరీక్షలు ఫెయి లైన విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధులుగా చేసేందుకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వ హిస్తున్న రెమిడియల్ క్లాసులకు విద్యా ్థులు హాజరయ్యేలా శ్రద్ధ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై జిల్లా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. గురువారం ఏలూరులోని సుబ్బమ్మదేవి మునిసిపల్ హైస్కూలులో నిర్వహిస్తున్న రెమిడియల్ క్లాసులను ఆకస్మికంగా పరిశీలించిన కలె క్టర్ వెట్రిసెల్వి అక్కడి స్కూలులో ప్రత్యేక తరగతులకు విద్యార్థులు పెద్దసంఖ్యలో గైర్హాజరు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో స్కూలు హెచ్ ఎం, మరో ఇద్దరు సైన్సు టీచర్లకు డీఈవో వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. ఇక్కడి స్కూలు లో రెమిడియల్ క్లాసులకు 51 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా కలెక్టర్ ఆకస్మిక సందర్శనలో కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్టు నిర్ధారించు కున్నారు. దీంతో హెచ్‌ఎంను, టీచర్లను ఆరా తీయడంతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్‌లో నేరుగా కలెక్టర్ మాట్లాడారు. రెమిడియల్ క్లాసులకు విద్యార్థులను ఎందుకు పంపడం లేదని పేరెంట్స్‌ను ప్రశ్నిస్తూనే, ప్రత్యేక తరగతు లకు విద్యార్థులను తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారని ఉపాధ్యాయు లను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే హెచ్‌ఎంకు, ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా మరో మూడురోజుల్లోనే (ఈ నెల 19 నుంచి) టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Updated Date - May 17 , 2025 | 12:35 AM