ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ బడి భేష్‌

ABN, Publish Date - May 19 , 2025 | 12:34 AM

‘ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు భేష్‌.. మీ పిల్లలను పంపిస్తే ప్రతిభ కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం.’

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న పాఠశాల ఉపాధ్యాయులు

తల్లిదండ్రులూ పిల్లలను పంపించండి

గ్రామాల్లో ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం

విద్యార్థుల నమోదు పెంచడానికి చర్యలు

ప్రభుత్వ కొత్త విధానాలపై అవగాహన

భీమవరం రూరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు భేష్‌.. మీ పిల్లలను పంపిస్తే ప్రతిభ కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం.’ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారంలో తల్లిదండ్రులకు ఇలా అవగాహన కల్పిస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త విద్యా విధానం, ఉచిత సౌకర్యాలు వివరిస్తున్నారు. ఉపాధ్యాయుల క్యాంపెయినింగ్‌తో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలో విద్యాశాఖ ఉంది. 2024–25 విద్యా సంవత్సరంలో పెరిగిన ఉత్తీర్ణత శాతాన్ని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

పెరిగిన ఉత్తీర్ణతా శాతం

గడిచిన మూడేళ్లలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం బాగా పడిపోయింది. 2021–22లో 45 శాతం లోపు, 2022–23 లో 50 శాతంలోపు ఉత్తీర్ణత నమోదైంది. 2023–2లో కూడా 50 శాతం ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన మారింది. నాలుగేళ్ల క్రితం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1.38 లక్షల మంది విద్యార్థులు ఉంటే 2023–24 సంవత్సరానికి 99 వేలకు పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యావిధానాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. పదో తరగతి బోధనలో పట్టుబిగించడంతో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 72.9 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 5,991 మందికి 3,910 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 6,619 మందికి 5,180 మంది ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో 592 మార్కులు సాధించిన ఘనత ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి దక్కింది. పది మంది విద్యార్థులైతే 586 మార్కులు పైబడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించారు.

విద్యా సామగ్రి అందించడంలోనూ స్పీడ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు సమయానికి అందించే ఏర్పాట్లు చేసింది. పది రోజుల క్రితమే పాఠ్యపుస్తకాలను మండలాల వారీగా అందించారు. 70 శాతం పాఠ్యపుస్తకాలు చేరాయి. మరో పది రోజుల్లో విద్యా సామగ్రి రానుంది. జిల్లాలో 93,450 విద్యార్థులకు బ్యాగులు, షూ, యూనిఫామ్‌ అందించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 6,51,038 నోట్‌ పుస్తకాలు, 12,58,847 పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందనున్నాయి. మొదటి తరగతి విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించడంతోపాటు మంచి బోధన అందించేలా పాఠ్య పుస్తకాలను రూపుదిద్దారు. మొదటి తరగతికి 2 టెక్ట్స్‌ బుక్స్‌, 2 నోట్‌ బుక్స్‌, రెండో తరగతికి 2 టెక్ట్స్‌ బుక్స్‌, 2 నోట్‌ బుక్స్‌, మూడో తరగతి విద్యార్థులకు 4 టెక్ట్స్‌ బుక్స్‌, 4నోట్‌ బుక్స్‌ అందించనున్నా రు. రెండు సెమిస్టర్ల వారీగా అందించనుండడంతో పుస్తకాల మోత ఉండ దు. 4, 5 తరగతులకు కూడా రెండు సెమిస్టర్లుగా పుస్తకాలు అందిస్తారు.

ఆరంభంలోనే విద్యా సామగ్రి

విద్యార్థులకు విద్యా సామగ్రి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 25 నాటికి స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మండలాల వారీగా పాఠ్యపుస్తకాలు చేరాయి. విద్యా సామగ్రి కూడా అందిస్తాం.

– వై.చంద్రశేఖర్‌, కమ్యూనిటీ మొబలైజింగ్‌ ఆఫీసర్‌

Updated Date - May 19 , 2025 | 12:34 AM