కదలిక
ABN, Publish Date - May 17 , 2025 | 12:23 AM
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి దగ్గర కావస్తోంది. జగన్ జమానాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఏడాదిగా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్కటిగా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంది.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు కసరత్తు
తెలుగుదేశం ప్రభుత్వంలో వేగంగా నిర్ణయాలు
లబ్ధిదారులకు వచ్చేనెల అత్యంత కీలకం
రేషన్‌కార్డుల తప్పు ఒప్పుల సవరణలకు వెసులుబాటు
కొత్తగా 4 వేలమంది వితంతువులకు పింఛన్లు
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి దగ్గర కావస్తోంది. జగన్ జమానాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఏడాదిగా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్కటిగా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా నడవడానికి వీలులేని రహదారులను ఇప్పటికే మరమ్మతులు చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలుపై కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డుల్లో సవరణలకు, మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిం ది. వితంతువులకు చేయూత నిచ్చేలా వచ్చే నెలలోనే కొత్త వారికి పింఛన్లు ఇవ్వాలని సంకల్పించారు. ప్రభుత్వ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాస్తా కదలిక వచ్చింది.
(ఏలూరు – ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకు నేందుకు వివిధ విభాగాల్లో రంగం సిద్ధం చేస్తోంది. ప్రతీది ఆర్థికంగా ముడిపడి ఉండడంతో సాధ్యమైనంత మేర ఖాజా నాను నింపే దారి లేక తడబాటు పడ్డారు. కానీ ఎక్కడ లోపం ఉందో దానిని సవరించేందుకు ప్రయత్నాలు సాగాయి. ప్రత్యేకించి జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలే కాక సంక్షే మానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్ప టికే చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ మాట అక్షరాల నిజం చేసేలా ప్రణాళికాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి వ్యవ సాయ ఆధార జిల్లా అయిన ఏలూరులో రైతులకు సాయపడే దిశగా ముమ్మర ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.
గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రైతు భరోసా పేరిట రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేవారు. తొలుత లక్షా తొంబ్భై ఏడు వేల నుంచి రైతు లబ్ధిదారుల సంఖ్య నాలుగేళ్ల పాటు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఏడాదికి రూ.15 వేలు చొప్పున సాయమందించారు. జగన్ సర్కారు ముగిసే నాటికి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2,35,847 రైతులకు సుమారు రూ.18.38 కోట్లు చెల్లించగలి గారు. తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో రైతు భరోసాలో తమకు చోటు కల్పించలేదంటూ అనేకమంది కలెక్టర్ దగ్గర నుంచి ఇతర అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే వచ్చారు. కొంత పార్టీ పక్షపాత దిశగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించ డంతో చాలామంది రైతు కుటుంబాలు భరోసాను పొంద లేకపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాల చేపట్టిన తర్వాత ఏ పఽథకమైనా అర్హులైన లబ్ధిదారులకే అనే నినాదంతో ముందుకెళుతోంది. అప్పటి రైతు భరోసా పథకాన్ని మార్చి అన్నదాత సుఖీభవగా కొత్త పేరును అమల్లో పెట్టారు. జూన్‌లో ఖరీఫ్ పనులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు సుఖీభవ కింద పూర్తి కసరత్తు చేయడమే కాకుండా లోపాలు తలెత్తకుండా, విమర్శ లకు తావులేకుండా రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తొంది. ఇప్పటికే వ్యవసాయశాఖ ఈ దిశగానే కస రత్తుల్లో తలమునకలై ఉంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందకు అనువుగా బ్యాంకర్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రూ.13,500 మాత్రమే రైతులకు అందించగా తాజాగా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించ బోతున్నారు. ఈ మొత్తాన్ని ఏడాదికి ఎన్ని విడతల్లో అందిస్తారో మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
ఫ అమ్మకు వందనం రెడీ.. జూన్ వచ్చిందంటే చాలు పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తల్లిదండ్రులకు కాళ్లు చేతుల్లో వణుకు. విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా ఫీజులకు అయ్యే సొమ్ముల కోసం వెంపర్లాట. అదే అల్ప ఆదాయ వర్గాల్లో ఇది తీరని బెంగ. గడచిన ప్రభుత్వంలో విద్యార్థుల సంక్షేమం నిమిత్తం అమ్మ ఒడి ప్రవేశ పెట్టారు. ఏలూరు జిల్లాలోనే అమ్మబడి పథకం కింద 1,78,214 మంది లబ్ధిదారులకు నాలుగేళ్లలో రూ.1069 కోట్లు అప్పట్లో అందించారు. అయితే ఇస్తామన్న మొత్తం సొమ్ముల్లో స్వీపర్ మెయింటెన్స్ ఛార్జీల పేరిట రూ.2 వేలు పక్కన పెట్టించారు. అప్పట్లో తల్లులందరికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.13 వేలతోనే సరిపెట్టడం విశేషం. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కుటుంబంలో ఎంతమంది చదువుకునేవారు ఉంటే రూ.15 వేలు చొప్పున అందరికీ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పడు దానిని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. జగన్ ప్రభుత్వంలో వచ్చిన లబ్ధిదారుల సంఖ్య కంటే టీడీపీ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల సంఖ్య మూడింతలు పెరిగే అవ కాశం ఉంది. సాధ్యమైన మేర పాఠ శాలలు తెరిచే నాటికే ఇంటిల్లిపాలిది మెచ్చేలా తల్లికి వందనం వేయబోతున్నారు. విద్యాశాఖ ఈ దిశగా వేగంగా కసరత్తు చేస్తోంది.
రేషన్ కష్టాలకు చెక్
ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డు కావాలన్నా, సవరించాలన్నా ఏదైనా వలంటీర్ల చేతిలోనే ఉండేది. అనర్హులకు సైతం అప్పట్లో తెలుపురంగు రేషన్‌కార్డులు సొంతమ య్యాయి. కొత్తగా పెళ్లి అయిన జంటలకు విడిగా రేషన్‌కార్డులు ఇవ్వాలన్నా అచితూచి వ్యవహరిం చేవారు. జిల్లా వ్యాప్తంగా 6లక్షల 25 వేలకు పైగానే రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటన్నింటిని సవరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఫలితంగా రేషన్‌కార్డులు ఎవ్వరిని తొలగించాలన్నా కొత్త చేర్చాలన్నా మార్గదర్శకాలు సులభతరం చేసింది. అయినప్పటికి ఈ ప్రక్రియ యావత్తు గురువారం నుంచే అమల్లోకి రాగా ఆదిలోనే సర్వర్ కష్టాలు ఎదురవుతున్నాయి. మార్పులు చేర్పులకు తడబాటు మొదలైంది. జూన్ ఒకటో తేదీ నుంచి గతంలో వున్న పాత రేషన్‌కార్డుల స్థానంలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ఇప్పటికే పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సాధ్యమైంత మేర ఆలోపే మార్పులు చేయాలని ఒక్కసారిగా ప్రజల్లో కదలిక రావడంతో ఆ ప్రభావం కాస్తా సర్వర్లపై ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు సచివాలయ సిబ్బంది చొరవ తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు వచ్చే నెలలో రాష్ట్రంలో లక్ష మంది వితంతు కొత్తగా పింఛన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 67 వేలమంది వితంతువులు ఉండగా ఇప్పుడు కొత్త్తగా మరో నాలుగు వేల మందిని ఈ జాబితాలో చేర్చను న్నారు. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కొత్త వితంతువు లను గుర్తించి వారికి పింఛను ఇవ్వాలన్నా సంకల్పం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
Updated Date - May 17 , 2025 | 12:25 AM